Anil Ravipudi: “భగవంత్ కేసరి” లో శ్రీలీల పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా కీలక పాత్రలో కనిపించబోతోంది.

ఇక అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ తో దద్దరిల్లిపోయే రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఈ టీజర్ యూట్యూబ్ లో 16 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఈ సినిమాలోని శ్రీలీల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. శ్రీలీల ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈ శ్రీలీల పాత్ర గురించి ఓ ఇంట్రెస్ట్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్ర కోసం మొదట మరో స్టార్ హీరోయిన్ ని ఎంచుకున్నారట. కానీ ఆ పాత్రని ఆమె రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు అందాల భామ కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ అయితేనే బాలయ్య కూతురిగా బాగా సెట్ అవుతుందని మూవీ యూనిట్ భావించారట. అయితే కథ విన్నాక కృతి శెట్టి ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. దీంతో సెకండ్ ఆప్షన్ కింద అనిల్ రావిపూడి శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన నేటిజెన్లు ఇంత మంచి పాత్రను మిస్ చేసుకుందని సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు