Agent: ఐటెం సాంగ్‌లో ఊర్వశి ధరించిన పొట్టి డ్రెస్ ధర ఎంతో తెలుసా ?

భారీ అంచనాలతో శుక్రవారం థియేటర్ లో విడుదలైన అఖిల్ అక్కినేని ఏజెంట్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. అఖిల్ రెండేళ్ల కష్టం వృథా అయిందంటూ విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు. అయితే అఖిల్ యాక్టింగ్ మాత్రం బాగుందని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చాలా మైనస్ లు ఉన్నాయని అభిప్రాయపడతున్నారు. అలాగే ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత బాగుంటే, సినిమాకు మరోలా ఉండేదని అంటున్నారు. పాటలు కూడా సందర్భం లేకుండా వస్తున్నాయని, అలా వచ్చిన పాటలు కూడా వినసంపుగా లేవని విశ్లేషకులు బహిరంగంగానే చెబుతున్నారు.

అయితే అన్ని పాటలు ఎలా ఉన్నా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా చేసిన వైల్డ్ సాల ఐటెం సాంగ్ మాత్రం హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ఊర్వశీ రౌతేలా ఇప్పటి వరకు చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఇటీవల తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాలో చేసిన బాస్ పార్టీ సాంగ్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఏజెంట్ లో కూడా హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఈ ఐటెం సాంగ్ ప్లెస్ మెంట్ సరిగ్గా లేకపోవడం, మ్యూజిక్ సరిగ్గా లేకపోవడంతో ఇది కూడా తెలిపోయింది. అయితే ఐటెం సాంగ్ గురించి పక్కన బెడితే, ఈ సాంగ్ లో ఊర్వశీ రౌతేలా ధరించిన పొట్టి డ్రెస్ గురించి మాత్రం చర్చ జరుగుతుంది.

ఈ స్పెషల్ సాంగ్ లో ధరించిన ఈ పొట్టి డ్రెస్ ను ప్రత్యేకంగా ఊర్వశీ కోసమే డిజైన్ చేయించారట. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్ లో ఉన్న ఊర్వశీ లుక్ అందరనీ ఆకర్షించింది. ఈ డ్రెస్ కోసం నిర్మాతలు ఏకంగా రూ. 20 లక్షలు ఖర్చు చేశారట. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్ లో ఈ ఐటెం సాంగ్ లో పొట్టి డ్రెస్ లో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేయడంతో అభిమానులు కళ్లు తిప్పుకోకుండా, ఈ బ్యూటీ చూస్తూ ఉండిపోతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు