Satya Sri: జబర్దస్త్ సత్య శ్రీ ఎవరు..ఆమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

జబర్దస్త్ కామెడీ షోలో చమ్మక్ చంద్ర టీమ్ లో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈమె ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది ఇక ఈ షో కి భారీ పారితోషకంలో పారితోషకం కూడా తీసుకున్నారని సమాచారం. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సత్య శ్రీ మాట్లాడుతూ.. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. డైలాగ్ ఎలా చెప్పాలో కూడా బోయపాటి శ్రీను యాక్టింగ్ చేసి మరీ చూపించారు. సరైనోడు , జయ జానకి నాయక వంటి సినిమాలలో కూడా చేశాను.. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ నా ఫేవరెట్ సినిమా.. అందులో నాకు మరింత మంచి పాత్ర లభించింది అంటూ సత్యశ్రీ తెలిపింది.

ఇక ఈ సినిమా తర్వాత నాకు చాలా ప్రాజెక్ట్లలో అవకాశాలు వచ్చాయి. అయితే డేట్స్ సరిగ్గా కుదరకపోవడం వల్లే మరిన్ని మంచి ప్రాజెక్ట్లలో అవకాశాలను కోల్పోయాను.అలా నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో అవకాశం వస్తే.. వేరే సినిమాలో నటిస్తూ ఉండడం వల్ల డేట్స్ కుదరక ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అయితే నాగార్జున, నాగచైతన్య కాంబోను మిస్ చేసుకున్నానని.. చాలా బాధపడ్డాను అంటూ తెలిపింది.2014లో తన పదవ తరగతి అయిపోయిందని.. తనకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అని సత్యశ్రీ తెలిపింది.

అలాగే తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుతూ.. అమ్మ నాకోసం ఎంతో త్యాగం చేసింది.. తన ఇండస్ట్రీ లైఫ్ ని కూడా త్యాగం చేసింది.. ఇక అమ్మమ్మది కాకినాడ అయితే ఆమె ఇప్పుడు స్వర్గస్తులయ్యారు.. అమ్మమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు .. పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు కూడా చేశారు . అమ్మమ్మ చాలామందికి ఉపాధి కూడా కల్పించారు అంటూ సత్య శ్రీ తెలిపారు. తన చెల్లి పేరు కీర్తిశ్రీ అని, తనకు సినిమాలంటే అసలు ఇష్టం లేదు అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే ఇంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సత్య శ్రీ తన రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారట. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరుగుతోంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు