Hi Nanna : నానితో అట్లుంటది మరి… రిలీజ్ కు ముందే భారీ లాభాలు

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ “హాయ్ నాన్న”. ఈ మూవీ రిలీజ్ కి ముందే లాభాల బాట పట్టింది. నాన్ థియేటర్ రైట్స్ తో నిర్మాతలు సినిమా రిలీజ్ కి ముందే భారీ లాభాలను జేబులో వేసుకున్నారని టాక్ నడుస్తోంది. దీంతో నానితో అట్లుంటది మరి అని కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు.

‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత నాని చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ‘హాయ్ నాన్న’ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్లో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. కొత్త దర్శకులను పరిచయం చేసే హీరోలలో ముందు వరుసలో ఉంటాడు నాని. ఇప్పుడు కూడా “హాయ్ నాన్న” మూవీతో శౌర్యువ్ ను డైరెక్టర్ గా టాలీవుడ్ గా పరిచయం చేస్తున్నాడు. ఈ మూవీలో ‘సీతారామమ్’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక మరో బ్యూటీ శృతిహాసన్ స్పెషల్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కనిపించనుంది. నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రను పోషించింది. సినిమా మొత్తం మృణాల్, నాని, కియారా చుట్టే తిరుగుతుంది. డిసెంబర్ 7న ఈ మూవీని గ్రాండ్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఫిల్మీఫైకి అందుతున్న సమాచారం ప్రకారం ‘హాయ్ నాన్న’ మూవీ బడ్జెట్ 53 కోట్లు కాగా, నాన్ థియేట్రికల్ రైట్స్ 58 కోట్ల ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడు అయ్యాయట. దీంతో మూవీ రిలీజ్ కి ముందే ఐదు కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమాకు సంబంధించిన శాటిలైట్ బిజినెస్ మాత్రం ఇంకా కాలేదని తెలుస్తోంది. ఓవర్సీస్ బిజినెస్ 10 కోట్లు కాగా, ఆడియో రైట్స్ 9 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అంతేకాకుండా ‘హాయ్ నాన్న’ మూవీ ఓటిటి రైట్స్ కళ్ళు చెదిరే రేటుకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

- Advertisement -

అన్ని భాషల్లో కలిపి ‘హాయ్ నాన్న’ డిజిటల్ రైట్స్ 37 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఓటిటి సంస్థకు నిర్మాతలు ఈ రైట్స్ ను ఇచ్చేసారట. అయితే ఆ ఓటిటి ప్లాట్ఫామ్ ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు. ఇక ‘దసరా’ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన నాని ‘హాయ్ నాన్న’ సినిమాపై కూడా భారీ అంచనాలే పెంచేశాడు. దానికి తగినట్టుగా ప్రమోషన్స్ లో కూడా జోరు పెంచాడు. మరి ఈ మూవీ నానికి మరో హిట్ ను ఇస్తుందా లేదా అనేది చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు