Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఇది కదా అసలు మజా అంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుని.. ఆరు పదుల వయసులో కూడా బిజీగా దూసుకుపోతూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సితార బ్యానర్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండీ తాజాగా ఒక బిగ్ అప్డేట్ బయటకొచ్చింది..

ఇక ఆ అప్డేట్ విషయానికొస్తే.. ఇందులో ఏకంగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. మీనాక్షి చౌదరి , త్రిష, ఊర్వశి రౌతేల ఇలా వీరు ముగ్గురు ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య, బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య పాత్ర మూడు కోణాల్లో ఉంటుందని.. అటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించబోతుందని సమాచారం. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై షూట్ చేస్తున్నట్లు సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయని తెలుస్తోంది.

యాక్షన్ ప్రధానంగా వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా మరో విజయాన్ని అందిస్తుందని అభిమానుల సైతం చెబుతున్నారు. అంతేకాదు బాలయ్య బాబు వస్తున్న ఈ సినిమా నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మధ్యకాలంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇక బాలయ్య విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోగా బిజీగా దూసుకుపోతున్న ఈయన మరోపక్క రాజకీయంగా కూడా మరింత వేగంగా పావులు కదుపుతున్నారు. అలాగే తన కొడుకు మోక్షజ్ఞ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక కథ కూడా సిద్ధంగా ఉందని.. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కూడా తెలుస్తోంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు