Tripti dimri: యానిమల్ నటి లవ్ స్టోరీ.. బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే షాక్..!

యానిమల్.. గత ఐదు రోజులుగా ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో హిట్ సాంగ్స్, ఫైట్స్ , బోల్డ్ సన్నివేశాలు ఇలా అన్నింటి గురించి కూడా ప్రేక్షకులు తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక , రణబీర్ కపూర్ పోటీపడి మరి నటించారని చెప్పాలి. ఇక తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. వీరితోపాటు ప్రేక్షకులను అలరించిన మరొక హీరోయిన్ తృప్తి దిమ్రి గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండడం గమనార్హం. అయితే తాజాగా ఈమె గురించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆమె లవ్ స్టోరీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే తృప్తి దిమ్రి సింగిల్ కాదు అని.. ఆమె టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ బావతో ప్రేమలో ఉందనే వార్త ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఢిల్లీలో పుట్టి పెరిగిన తృప్తి 2017లో వచ్చిన శ్రీదేవి హీరోయిన్ గా నటించిన మామ్ సినిమాతో ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది. ఆ తర్వాత లైలా మజ్ను, బుల్ బుల్ ,కాలా, పోస్టర్ బాయ్స్ వంటి చిత్రాలలో నటించిన ఈమె ఈ సినిమాల ద్వారా హిందీలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు యానిమల్ చిత్రంతో జోయా అనే పాత్రలో నటించి తన అదృష్టాన్ని ఒక్కసారిగా మార్చుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా విడుదలైనప్పుడు 6 లక్షల వరకు ఇన్స్టాలో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న తృప్తి ఇప్పుడే కాకుండా 20 లక్షల ఫాలోవర్స్ ని కలిగి ఉంది.

ఇకపోతే ఈమె లవ్ స్టోరీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ బావ ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ అన్నతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తృప్తి నటించిన బుల్ బుల్ సినిమాకి అనుష్క శర్మ సొంత అన్నయ్య కర్నేశ్ శర్మ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. అలా కొన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న వీరు కొన్ని నెలల ముందు ఇద్దరు ఇన్స్టా లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు ఫోటోలని కూడా డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరికీ బ్రేకప్ అయినట్లు అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా ద్వారా ఈమె లవ్ బ్రేకప్ టాపిక్ మరొకసారి డిస్కషన్ లోకి వచ్చింది. ఏది ఏమైనా ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకుంది తృప్తి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు