Kollywood: అమలాపాల్ రెండో భర్త ఆస్తులు ఎంతో తెలుసా ?

కేరళ కుట్టి అమలాపాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సౌత్ సినీ ప్రియులందరికీ అమలాపాల్ సుపరిచితమే. పాత్ర డిమాండ్ చేస్తే ఒంటిపై నూలిపోగు లేకుండా నటించడానికి కూడా సిద్ధమే అని నిరూపించి బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అమలాపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది.

కొచ్చిలో స్టార్ హోటల్ లో ప్రియుడు జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. ఈ పెళ్లికి అమలాపాల్ స్నేహితులు, కొంతమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. అమలాపాల్, జగత్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రీసెంట్గా ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్. ఇక అమలాపాల్ పుట్టిన రోజున ఇద్దరు గోవాలో ఉంగరాలు మార్చుకున్నారు. అలా వారి నిశ్చితార్థం జరిగింది.

ఇప్పుడు ఇద్దరు పెళ్లితో ఒకటయ్యారు. అయితే అమలాపాల్ రెండో భర్త ఎవరు? ఏం చేస్తాడు? జగత్ దేశాయ్ ఆస్తుల విలువెంత? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఉత్సాహం చూపుతున్నారు. జగత్ దేశాయ్ గోవాలోని ఓ విల్లా గ్రూపులో సేల్స్ హెడ్ గా వర్క్ చేస్తున్నాడు. అలాగే అతనికి సొంతంగా కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. జగత్ ది ది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కోట్లకు ఒక్కగానొక్క వారసుడు. అతని ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందట.

- Advertisement -

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు