Bollywood: పట్టుకుంటే 50 వేలు… సన్నీ లియోన్ బంపర్ ఆఫర్

బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ తాజాగా చేసిన పోస్ట్ చూస్తే ఆమెలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పుడు శృంగార దేవతగా కనిపించిన సన్నీ ఇప్పుడు చేస్తున్న పనులు చూస్తుంటే మరో కొత్త కోణంలో కనిపిస్తోంది. గతాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి పోర్న్ సినిమాల్లో నటించకుండా పద్ధతిగా జీవించడం దగ్గర నుంచి, పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకోవడం వరకూ ఆమె చేసిన మంచి పనులతో సన్నీపై జనాలకు ఇదివరకున్న ఒపీనియన్ చాలా వరకు మారిపోయిందని చెప్పాలి. ఇక తాజాగా సన్నీలియోన్ చేసిన మరో పని తన మంచితనాన్ని, మంచి మనసును అందరికీ తెలిసేలా చేసింది.

సన్నీ తన దగ్గర పని చేసే ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయి తప్పిపోయింది అని, ఆ అమ్మాయిని కనిపెట్టిన వారికి 50 వేలు ఇస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిన్న సాయంత్రం తప్పిపోయిన ఆ చిన్నపిల్లను వెతకని చోటంటూ లేదని, ఒకవేళ ఆ పాప వివరాలు ఎవరికైనా తెలిస్తే దయచేసి తమరికి తెలియజేయాలంటూ పలు ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేసింది. ఆ పోస్టులో పాప ఫోటో కూడా ఉంది. అంతేకాకుండా సన్నీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ముంబై పోలీస్ లను కూడా ట్యాగ్ చేసింది. ముందు పదివేలు ఇస్తానని ప్రకటించిన సన్నీ ఆ తర్వాత ఇంకో 50,000 ఇస్తానంటూ ప్రకటించింది. వివరాలు చెప్పిన వారికి ఆ నగదు అందజేయనున్నట్టు సన్నిలియోన్ తన పోస్ట్ లో వెల్లడించింది.

ఒక పనిమనిషి కుటుంబానికి సంబంధించిన సమస్యను తన భుజాన వేసుకుని, ఆ పాప కోసం సన్నీ తల్లడిల్లుతున్న తీరుకి నెటిజెన్లు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల నీ మీద రెస్పెక్ట్ మరింతగా పెరిగిపోతుంది సన్నీ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ పాప త్వరగా దొరకాలని ప్రార్థిస్తున్నారు. ఇకపోతే కనిపించకుండా పోయిన ఆ చిన్నారి ఆచూకీ ఇంకా తెలియలేదని సమాచారం.

- Advertisement -

కాగా సన్నీలియోన్ చివరగా మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో మెరిసింది. ఈ హారర్ కామెడీ అండ్ మూవీలో సన్నీలియోన్ కు ఫుల్ లెంగ్త్ రోల్ లభించడంతో పాటుగా ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు