Tollywood: ‘ సలార్’ ఫస్ట్ రివ్యూ… లీక్ చేసిన హీరోయిన్

ప్రస్తుతం అందరి కళ్ళు ప్రభాస్ పైనే ఉన్నాయి. “సలార్” మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. మేకర్స్ ఈ మూవీ రిలీజ్ కు డిసెంబర్ 22న ముహూర్తం పెట్టగా, ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 1 నుంచి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇందులో భాగంగానే డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ కానుంది అంటూ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని, దీనికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని ఊహగానాల మధ్య “సలార్” మూవీ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ హీరోయిన్ “సలార్” ఫస్ట్ రివ్యూ ఇచ్చేసి, మూవీ పై అంచనాలను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు హన్సిక.

హన్సిక గురించి టాలీవుడ్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘దేశముదురు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బిల్లా’లో కూడా ఈ అమ్మడు ప్రత్యేక పాత్రలో కనిపించి మురిపించింది. ఇటీవల పెళ్లి చేసుకున్న హన్సిక ఆ తర్వాత సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. తాజాగా హన్సిక ‘సలార్’ సినిమాపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆ ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ తనకు కూడా ప్రభాస్ అంటే చాలా అభిమానం అని, అందుకే తాను కూడా ‘సలార్’ మూవీ గురించి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించింది. ఇక ఈ మూవీలో నటించిన శ్రియ రెడ్డి తనకు మంచి స్నేహితురాలని, సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలను రివీల్ చేసిందని, ఆ విషయాలను ప్రస్తుతం బయటకు అయితే చెప్పలేను కానీ ‘సలార్’ ఫస్ట్ పార్ట్ మాత్రం అదిరిపోయింది అంటూ ఊరించింది. అంతేకాదు ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక అంచనాలకు మించి సక్సెస్ అందుకుంటుందనీ, ప్రభాస్ కెరీర్ లోనే ఫీల్ గుడ్ మూవీ గా నిలిచిపోతుందంటూ జోస్యం చెప్పేసింది. ట్రైలర్ గురించి మాట్లాడుతూ మామూలుగా ఉండదని, అభిమానుల అంచనాలను ఏమాత్రం నిరాశపరచకుండా అద్భుతంగా ఉంటుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపేసింది. సినిమా రిలీజ్ కాకముందే హన్సిక పాజిటివ్ కామెంట్స్ తో రివ్యూ ఇచ్చేయడంతో డార్లింగ్ ఫాన్స్ “సలార్”ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని మరింత ఆశగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు