Samantha: సమంతను అమల టార్చర్ చేసిందా..? విడాకులు అందుకేనా..?

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి వీళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డు వేసిన ఈ జంట మీద వస్తున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ.. వాళ్ళిద్దరూ అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. ఇక మయోసైటీస్ అనే వ్యాధి నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సమంత.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వివాహ జీవితంలో తాను ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, తనపై అనవసరంగా నిందలు వేశారని పేర్కొంది సమంత. విడాకులు తీసుకున్న కొంతకాలానికి పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఖాళీగా ఉండలేక దానికి ఓకే చెప్పానని తెలిపింది. అయితే సమంత – నాగచైతన్య విడాకులకు కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ అసలు కారణం మాత్రం అమల అనే అంటున్నారు.

పెళ్లయిన దగ్గర నుండి అమల సమంతకి ప్రతి విషయంలోనూ కండిషన్స్ పెట్టేదట. సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలలో నటించకూడదని, పొట్టి దుస్తులు ధరించకూడదని, బోల్డ్ పాత్రలలో నటించరాదని, కుటుంబ పరువు పోయేలా ఏ కార్యక్రమం కూడా చేయరాదని ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టిందట అమల. ఇక ఇవన్నీ భరించలేకనే సమంత నాగచైతన్యతో కలిసి వేరు కాపురం పెట్టిందట. అయినప్పటికీ నాగచైతన్య అమల చెప్పినట్టే నడుచుకోవడంతో తరచూ వీరి మధ్య గొడవలు వస్తుండేవని, అందుకే విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు