Costumes krishna: టాలీవుడ్ కి చెందిన ప్రముఖ విలన్ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమ కి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్, విలన్, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ ఈ రోజు ఉదయం చనిపోయారు. కాస్ట్యూమ్స్ కృష్ణ అంటే ఇప్పటి వారు గుర్తు పట్టక పోవచ్చు. కానీ భారత్ బంద్ సినిమా సీఎం కాండిడేట్ అంటే బాగా గుర్తు పడతారు. ఆ సినిమా తోనే ఈయన నటుడిగా పరిచయమయ్యారు.

అయితే అందరూ ఇతన్ని కాస్ట్యూమ్స్ కృష్ణ అని అంటారు. ఎందుకంటే 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా సినిమారంగంలో ప్రవేశించాడు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి లాంటి స్టార్‌ హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు కూడా ఆయన కాస్ట్యూమ్స్‌ అందించాడు.

ఇక కోడి రామకృష్ణ భారత్ బంద్ సినిమా తో నటుడిగా పరిచయం అయిన కృష్ణ ఆయన్ని గురువుగా భావించేవారు. కోడిరామకృష్ణ దర్శకత్వం లో చాలా సినేమాల్లో ఈయన నటించారు. అంతే కాదు ఈయన స్వయంగా 8 చిత్రాలు నిర్మిచారు. అల్లరి మొగుడు, మా ఆయన బంగారం, పెళ్ళిపందిరి, పుట్టింటికి రా చెల్లి, పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్లి పందిరి సినిమాలు ఆయనకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టాయి.

- Advertisement -

కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యుడిగా కొన్నాళ్ళు పనిచేశారు. కాస్ట్యూమ్స్ కృష్ణ ఈరోజు ఉదయం చెన్నై లోని ఆయన స్వగృహం లో కన్నుమూశారు. ప్రొడ్యూసర్స్  దిల్ రాజు, డి. వి. వి దానయ్య తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా సంతాపం తెలియచేసారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు