Akhil : ఇంకా షూట్ పూర్తి కానీ ఏజెంట్ – అనుకున్న టైం కి వస్తాడా..? 

అక్కినేని వారసుడు అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఏజెంట్. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ, ప్రొడక్షన్ పనుల్లో జాప్యం, అఖిల్ గాయాల పాలు అవటం వల్ల పలు మార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఏప్రిల్ 28న విడుదల చేయటానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే పరిస్థితి చుస్తే ఈసారి అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకు రావటం  కూడా కష్టమే అనిపిస్తుంది. ముంబై, కొచ్చిలో ఇంకా కొంత భాగం షూట్ పెండింగ్ లో ఉండటం, రీరికార్డింగ్ ఇంకా పూర్తి కాకపోవటమే ఇందుకు కారణం అని సమాచారం.

ఒకవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా సినిమా ప్రమోషన్స్ ఊసే లేదు. రెండు సాంగ్స్ రిలీజ్ చేయటం మినహా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చేసిందేమి లేదు. అసలే 80కోట్లు బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయాలి, అలాంటిది ఈ సినిమా ప్రమోషన్స్ తీరు చుస్తే అఖిల్ కి ఈ సారి కూడా హిట్ రాదేమో అన్న అనుమానం తలెత్తుతోంది. అఖిల్ లుక్స్ ప్రామిసింగ్ గా ఉన్నప్పటికీ, సురేందర్ రెడ్డి టేకింగ్ మీద నమ్మకం ఉన్నప్పటికీ నిర్మాత అనీల్ సుంకర ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఈ సినిమా గట్టెక్కటం కష్టమే.

ముంబై, కొచ్చిలో షూట్ తో పాటు, ఒక సాంగ్ కూడా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయటం కష్టమే కానీ, సినిమా యూనిట్ మాత్రం ఏప్రిల్ 28న సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తోంది. నిర్మాత అనీల్ సుంకర దగ్గరుండి పనులు చేయించుకుంటే తప్ప పెండింగ్ వర్క్ పూర్తి కాదు. రిలీజ్ డేట్ దృష్టిలో పెట్టుకొని ఆఘ మేఘాన షూట్ చేస్తే సినిమా క్వాలిటీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మరి, ఇలాంటి టైం లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఏ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తాడో, ప్రొడ్యూసర్ అనీల్ సుంకర ఇంటెన్షన్ ఏమిటో వారికే తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు