Jahnvi kapoor: బాయ్ ఫ్రెండ్ తో మళ్ళీ దొరికిన హీరోయిన్..

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ధడక్ అనే సినిమా ద్వారా హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది ఈ ముద్దుగుమ్మ. గ్లామరస్ బ్యూటీగా నిత్యం వార్తల్లో నిలిచే జాన్వి ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వి డేటింగ్ చేస్తుందంటూ బీ టౌన్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు స్పందించని ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరోసారి ప్రియుడితో కలిసి కెమెరా కంట పడింది. బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా తో కలిసి ఆమె ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వచ్చారు. మార్చ్ 31వ తేదీన నీతూ అంబానీ ఈవెంట్ కు హాజరైన జాన్వితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చారు. వైట్ డ్రెస్ లో జాన్వి కపూర్ దర్శనమిచ్చింది. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు