Dasara: నార్త్ లో కనిపించని దసరా – నాని శ్రమ వృధాయేనా ..?

నాచురల్ స్టార్ నాని హీరోగా డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందించబడి, ఇటీవలే విడుదలై మంచి టాక్ అందుకోవటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా కొల్లగొడుతుంది. ఇదిలా ఉంటే నార్త్ ఆడియెన్స్ మాత్రం నాని దసరాని లైట్ తీసుకున్నట్టు ఉన్నారు. తెలుగు నాట ఊపేస్తున్న దసరా అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది అనే చెప్పాలి. అయితే, అదే రోజు అజయ్ దేవగన్ సినిమా భోళా రిలీజ్ అవ్వటం ఇందుకు కారణంగా కనిపిస్తుంది.

పుష్ప కార్తీకేయ2 వంటి సినిమాలు ఇచ్చిన స్పూర్తితో చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు మన నిర్మాతలు. దసరా కూడా ఇదే కోవకు చెందుతుంది. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ మేకర్స్ రిస్క్ తీసుకోని ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసారు. అయితే గతంలో పుష్ప, కార్తికేయ 2, సీతారామం సినిమాలు కూడా మొదట్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి. తర్వాత మౌత్ టాక్ తో మంచి కలెక్షన్లనే రాబట్టాయి.

మరి, దసరా సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందేమో చూడాలి. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ప్రమోషన్స్ కోసం నార్త్ లో నాని పడ్డ కష్టం అంత వృధా అవుతుందనే చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు