Nithin32: దిల్ రాజు కొడుకు కోసం శ్రీలీల ఏం చేసిందో చూశారా..!

తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన మూడేళ్ల క్రితం తేజస్విని (మెఘారెడ్డి) ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు గతేడాది జూన్ 29న కుమారుడు అన్వై జన్మించారు. అయితే గురువారం దిల్ రాజు కుమారుడు అన్వై పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ పుట్టినరోజు వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, మహేష్ బాబు ఆయన కూతురు సితార, త్రివిక్రమ్, మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయపాటి శ్రీను, గోపీచంద్, ప్రియదర్శి, త్రినాధరావు నక్కిన, శివ నిర్వాణ, శైలేష్ కొలను, యంగ్ బ్యూటీ శ్రీలీల, గౌతమ్ తిన్ననూరి ఇలా హీరోలు, నిర్మాతలు, రాజకీయ నాయకులు, హీరోయిన్లు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే మొత్తం ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది హీరోయిన్ శ్రీలీల. ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా కెమెరాలన్నీ శ్రీలీల వైపే చూస్తున్నాయి. ఇందుకు అసలు కారణం రెడ్ ఫ్రాక్ లో శ్రీలీల చాలా అట్రాక్టివ్ గా కనిపించింది. చాలా సింపుల్ లుక్ లో దిల్ రాజు కొడుకుతో ఆడి పాడిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఎవరు పిలిచినా.. వారి దగ్గరకు వెళ్ళని దిల్ రాజు కొడుకు శ్రీలీల పిలవగానే నవ్వుకుంటూ వెళ్లిపోయాడట. అంతేకాదు దిల్ రాజు కొడుకు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసి రకరకాల బొమ్మలను తీసుకువెళ్లిందట శ్రీలీల. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు