Game Changer vs Devara : ఎవరిని ఎవరు డామినేట్ చేస్తున్నారు… పోటాపోటీగా ఓవర్సీస్ బిజినెస్

ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా సినిమాలలో దేవర, గేమ్ ఛేంజర్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న విడుదల కావలసిన ఎన్టీఆర్ దేవర పోస్ట్ పోన్ అయిందని రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు అతి తక్కువ గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఓవర్సీస్ లో ఈ రెండు సినిమాలకు జరిగిన బిజినెస్ ను కంపేర్ చేస్తూ ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారనే విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు. మరి ఇంతకీ ఈ రెండు సినిమాలకు ఓవర్సీస్ లో జరిగిన బిజినెస్ ఎంత? ఆ బిజినెస్ లో ఓవర్సీస్ కింగ్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన గత చిత్రం ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఎక్కువ ఎవరికి స్కోప్ ఉంది, బెస్ట్ యాక్టర్ ఎవరు అన్న విషయంపై నేటికీ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు హీరోల తాజా చిత్రాలపై కూడా ఆసక్తికరమైన టాక్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “దేవర” సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్‌” సినిమాను చేస్తున్నాడు. ఇందులో “దేవర” మూవీ ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మూవీ పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మేకర్స్ ఇంకా ఈ మూవీ పోస్ట్ పోన్ వార్తలపై స్పందించలేదు. కానీ బిజినెస్ డీల్స్ మాత్రం జోరుగా నడుస్తున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ “దేవర” మూవీ ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. 27 కోట్ల ఫాన్సీ రేటుకు దేవర రైట్స్ ను హంసిని ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేసింది. మరోవైపు రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్‌” ఓవర్సీస్ రైట్స్ 32 కోట్లకు అమ్ముడు కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ రెండు సినిమాల ఓవర్సీస్ మార్కెట్ ను పరిశీలిస్తే… గేమ్ ఛేంజర్‌ సినిమాకు తమిళ మార్కెట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే తమిళంలో శంకర్ స్టార్ డైరెక్టర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇతర భాషల్లోనూ ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. కానీ కొరటాలకు మాత్రం తెలుగులో తప్ప ఇతర భాషల్లో మార్కెట్ లేదు. కాబట్టి కచ్చితంగా బిజినెస్ వైజ్ గేమ్ ఛేంజర్‌ కు ప్రయోజనం ఉంటుంది. ఇక “దేవర” బ్రేక్ ఈవెన్ విషయానికొస్తే సుమారు 6.25M, గేమ్ ఛేంజర్‌ బ్రేక్ ఈవెన్ 7.5M. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ ను బట్టి ఎవరు ఓవర్సీస్ కింగ్ అనే విషయంలో క్లారిటీ వస్తుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు