NTR: ఎన్టీఆర్ భార్యకు భయపడుతున్నారా.. అందుకే ఇలా..!

జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన ఈయన రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. నిర్మాతలకు సైతం కళ్ళు చెదిరే రేంజ్ లో లాభాలను అందించింది ఈ సినిమా. గత కొన్నేళ్లుగా వరుసగా భారీ విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. మొదట్లో హీరోగా పేరు సంపాదించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో ఎక్కువగా లిప్ లాక్ సన్నివేశాలకు నో చెప్పేవారట. సింహాద్రి సినిమాలో భూమికతో ఇలాంటి సన్నివేశమే చేయవలసి వచ్చినందుకు ఎన్టీఆర్ నో చెప్పడంతో.. రాజమౌళి మాత్రమే ఎన్టీఆర్ కి తెలియకుండా చాలా ప్లాన్ చేసి బలవంతంగా ఇష్టం లేకపోయినా అలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం ఈ సినిమాని రూ.8.5 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కించగా.. అప్పట్లో 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్స్ కాబట్టి ఎన్టీఆర్ ని మాస్ హీరోగా అదుర్స్ అనిపించేలా చేసింది.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటానని కూడా తెలిపారు. ఈ రీజన్ వల్ల ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా అలాంటి సీన్స్ కనిపించవని కూడా చెప్పవచ్చు.. కథకు డిమాండ్ ఉంటేనే తప్ప అలాంటి సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి సన్నివేశాలలో నటించకపోవడానికి కారణం లక్ష్మీ ప్రణతినే కారణమని తెలుస్తోంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ సహజమే అయినా హీరోల భార్యలు మాత్రం వీటికి ఒప్పుకోవడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే కొన్ని కారణాల చేత దేవర సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో వార్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుండగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు