Kajal Agarwal: పెళ్ళి అయిన తర్వాత ఆ హీరో మోజులో కాజల్ ?

మన తెలుగు ఇండస్ట్రీలో… ప్రేమ వివాహం చాలా కామన్. అలాగే హీరోయిన్లు హీరోల ప్రేమలో పడడం… లేదా దర్శకులు, నిర్మాతలతో ఎఫ్ఫైర్ లు పెట్టుకోవడం చాలా కామన్. అలాంటి సంఘటనలు చాలానే జరిగాయి మన ఇండస్ట్రీలో..! ముఖ్యంగా హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోల లిస్టు పెద్దగానే ఉంటుంది. అయితే మరికొంతమంది సినిమాలు చేస్తున్న సమయంలో… హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిస్తారు హీరోలు.

అయితే తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు సంబంధించిన… లవ్ ఎఫైర్ ఇప్పుడు బయటపడింది. కాజల్ కు ఇప్పటికే పెళ్లయిన సంగతి తెలిసిందే. ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే హీరోయిన్ కాజల్… తన కెరీర్ లో చాలామంది హీరోలతో సినిమాలు చేసింది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ మగధీర సినిమా 2009 సంవత్సరంలో వచ్చింది. దీనికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా సమయంలో రాంచరణ్ మరియు కాజల్ మధ్య ప్రేమాయణం కొనసాగిందట.

ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇప్పటికి కూడా రామ్ చరణ్ తో… కాజల్ అగర్వాల్ కలుస్తూ ఉంటుందట. అయితే.. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ..మెగా కుటుంబం అంటే పడని కొంత మంది ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. కాగా రామ్‌ చరణ్‌, ఉపాసన 11 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప కూడా 2023 లో జన్మించింది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు