Urvashi Rautela: ఈ ఐటెం బ్యూటీ మరీ ఇంత రిచ్చా ?

సినిమా ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించాలంటే లక్ ఉండాలి. ఎంతో కష్టపడితే గానీ, స్టార్ హోదా రాదు. ఒక్కసారి స్టార్ హోదా వచ్చిందంటే లగ్జరీ లైఫ్.. ఖరీదైన బంగ్లాలు.. కోట్ల విలువ చేసే కార్లు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. అయితే సాధారణంగా ఎక్కువగా హీరోలు మాత్రమే ఈ లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు డబ్బులు సంపాదించడం చాలా తక్కువే. హీరోలకు ఒక్కో సినిమాకు 20 కోట్లు.. 50 కోట్లు అలా తీసుకుంటే, హీరోయిన్లకు అతి కష్టం మీద 2 కోట్లు.. 3 కోట్లు రెమ్యునరేషన్ వస్తుంది.

ఇలాంటి రెమ్యునరేషన్ తో హీరోయిన్లు లగ్జరీ లైఫ్ గడపడం కష్టమే. అయితే ఓ బాలీవుడ్ హీరోయిన్ కమ్ ఐటెం బ్యూటీ ఫుల్ లగ్జరీ లైఫ్ ను గడుపుతుంది. ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లాల్లో ఉంటుంది. తాజాగా ఈ ఐటెం బ్యూటీ ముంబైలో అపర కుబేరులు ఉండే కాలనీలో ఏకంగా 190 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట. ఆమె ఎవరో కాదు.. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్న ఊర్వశీ రౌటేలా.

ఊర్వశీ రౌటేలా పార్ట్ టైం హీరోయిన్ గా ఫుల్ టైం ఐటెం గర్ల్ ఉంటూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఆ మధ్య కోలీవుడ్ లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ అరుళ్ శరవణన్ తో ది లెజెండ్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఊర్వశీ ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక ప్రస్తుతం ఇటు సౌత్ లో అటు బీ టౌన్ లో ఊర్వశీకి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక్కో పాటకు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇలా ఈ ఐటెం బ్యూటీ.. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకుంటూ ఓ విలాసవంతైమన ఇల్లును కూడా కొనుగోలు చేసింది.

- Advertisement -

ప్రస్తుతం ఈ వార్త బీ టౌన్ వీధుల్లో వైరల్ గా మారుతుంది. కొన్నాళ్ల పాటు హీరోయిన్ గా ఉన్నవాళ్లే అద్దె ఇల్లుల్లో ఉంటే ఈ ఐటెం బ్యూటీ ఇన్ని కోట్లతో ఫ్లాట్ ఎలా కొనుగోలు చేసింది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు