RC15 : బాలీవుడ్ బ్యూటీ ?

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC15. రోబో 2.0 వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన పాన్ ఇండియా స్థాయి దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతుంది. కానీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రలో కనిపిస్తున్నారని, ఒకటి ఐఏఎస్ పాత్రలో అని, మరొక పాత్రలో రాజకీయ నాయకడిగా కనిపిస్తారని సమాచారం అందుతుంది.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయింది. ఈ సందర్భంలో షూటింగ్ ఆగిపోయందని, డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 చిత్ర పనుల్లో పడ్డాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం నుండి మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో ఒక బాలీవుడ్ నటి కీలక పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది.

హిందీ, తమిళ, మరాఠీ సినిమాల్లో కనిపించే హుమా ఖురేషీ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తో దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయినట్లు సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా హుమా ఖురేషీ గతంలో రజినీ కాంత్ హీరోగా వచ్చిన ‘కాలా’, అజిత్ హీరోగా వచ్చిన ‘వలిమై’ సినిమాల్లో కనిపించింది. అలాగే ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలోనూ దిలారుబా అనే పాత్ర చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు