Balakrishna: బోయపాటి సినిమాలో సీఎంగా బాలయ్య… రియాలిటీలో ఎలాగూ జరగదని ఇలా కానిస్తున్నారా?

టాలీవుడ్‌లో కొన్ని మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో ఒకటి బాలయ్య – బోయపాటి. ఈ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు మూడు సినిమాలు (సింహా, లెజెండ్, అఖండ) వచ్చాయి. నార్మల్ ఆడియన్స్‌ను పక్కన పెడితే, నందమూరి అభిమానులకు అయితే ఈ మూడు సినిమాలు ఫుల్ మీల్స్. ప్రతీ సినిమాలో లాజిక్‌లు అర్థం కాకపోయినా, బాలయ్య ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చాయి. అఖండ తర్వాత రామ్ పోతినేనితో బోయపాటి స్కంద అంటూ ఓ మూవీ చేశాడు. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ట్రోల్ అయింది.

దీంతో ఇప్పుడు బోయపాటి శ్రీను ఎలాగైన హిట్ కొట్టాలని మళ్లీ బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ సిద్ధమైందని టాక్. బాలయ్య ప్రస్తుతం బాబీతో NBK109 సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత NBK110గా బాలయ్య – బోయపాటి మూవీ ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి చిత్ర పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

ఈ సినిమాను బోయపాటి డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఎప్పటి లాగే హీరోకు ఉండాల్సిన ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఈ సారి స్టోరీలో పొలిటికల్ టచ్ ఉండేలా చూస్తున్నారట. బాలయ్య పొలిటికల్ కెరీర్‌కు ఈ మూవీ ఉపయోగపడేలా ఉంటుందని సమాచారం. అంతే కాదు, ఈ NBK110లో బాలయ్య ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర చేయబోతున్నారనే మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

అయితే దీనిపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. బాలయ్య రియాలిటీలో సీఎం అయ్యే ఛాన్స్ లేదని, ఒక వేళ వాళ్ల పార్టీ అధికారంలోకి వచ్చినా, సీఎంగా చంద్రబాబు లేదా అతని కొడుకు లోకేష్ అవుతారని, ఒక వేళ కూటమితో అధికారంలోకి వస్తే… పవన్ కళ్యాణ్ కి అయినా సీఎం ఛాన్స్ వస్తుంది కానీ, బాలయ్యకు సీఎం పీఠం దక్కే సూచనలే లేవు అని అంటున్నారు. ఎలాగూ రియాలిటీలో సీఎం అవ్వడం కష్టమని ఇలా రీల్ లో బాలయ్య సీఎం అవుతున్నాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు