VI Anand : భైరవకోన కాంబోలో మరో మూవీ!

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరుపేరు భైరవకోన’ థియేటర్ల వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను VI ఆనంద్ దర్శకత్వం వహించాడన్న సంగతి తెలిసిందే. మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఇక ఈ సినిమాలో దర్శకుడు vi ఆనంద్ పనితనం ఎంతో ఉందని చెప్పొచ్చు. కథ విషయంలో కాస్త తడబడినా మంచి స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. అయితే తాజాగా ఇప్పుడు ఇదే కాంబోలో మరో సినిమా రాబోతుంది.

అయితే తమిళుడైన VI ఆనంద్ తెలుగు సినిమాలతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికిపోతావ్ చిన్నవాడా సినిమాతో మంచి హిట్ కొట్టడమే గాక, దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. ఇతను దర్శకత్వం వహించిన ఒక్కక్షణం, డిస్కోరాజా సినిమాలు ప్లాప్ అయినా టెక్నికల్ గా బాగుంటాయి. ఫైనల్ గా నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఐతే త్వరలోనే ఆనంద్ ఒక స్టార్ హీరోతో బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే ఒక సినిమా అనౌన్స్ అయింది.

‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో ఒక నిర్మాత అయిన అనిల్ సుంకర VI ఆనంద్‌తో ఓ పెద్ద సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అయితే ఇందులో నటించే హీరో పేరు వెల్లడించలేదు కానీ.. ఓ పెద్ద హీరో సినిమానే అయి ఉండవచ్చు అని సమాచారం. ఇక నిర్మాత అనిల్ సుంకర లాస్ట్ ఇయర్ ఏజెంట్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలతో డిజాస్టర్లు అందుకుని భారీ నష్టాలు అందుకోవాల్సి వచ్చింది. ఇక ఈ ఇయర్ ఊరు పేరు బైరవకోన’తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. అందుకే ఆనంద్ తో సినిమా కుదుర్చుకున్నాడు. మార్చ్ లో ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ఒక స్టార్ హీరోతోనే ఉంటుందని సమాచారం.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు