Deepika Padukone: తల్లి కాబోతున్న లేడీ గ్లోబల్ స్టార్.. ఫొటోస్ వైరల్..!

బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా పేరు సంపాదించిన దీపికా పదుకొనే.. ఎలాంటి పాత్రలోనైనా సరే గ్లామర్ వొలకబోయడంలో తనకు తానే సాటి అంటూ ఎన్నోసార్లు నిరూపించుకుంది.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి.. సినిమాలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న దీపికా పదుకొనే అలవాటు లో భాగంగా పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం దీపిక పదుకొనే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు.. దీపికా పదుకొనే ఫిబ్రవరి 18న లండన్ లో జరిగిన 77 వ బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్) అవార్డుల కార్యక్రమంలో హోస్ట్ గా పాల్గొన్నారు.. అయితే ఈ వేడుకల్లో బంగారు, వెండి రంగుల కలయికలో అందమైన చీరను ఆమె ధరించింది..అంతేకాదు చూపు తిప్పుకోని అందంతో ఆకట్టుకుంటోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చీర కొంగుతో తన బేబీ బంప్ ను దాచుకునే ప్రయత్నం చేసింది దీపిక.. దీంతో దీన్ని పట్టేసిన పలువురు అభిమానులు ఈ ఫోటోని షేర్ చేసి మరీ కామెంట్లు చేస్తున్నారు

అభిమానులు మాత్రం ఈ విషయాన్ని చాలా గట్టిగానే నమ్ముతున్నారు.. త్వరలో దీపిక బిడ్డ కొత్త ప్రపంచంలోకి రాబోతోంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆమె వ్యక్తిగత జీవితంలో ఇలాంటి కామెంట్స్ చేయడం సరి కాదంటూ కూడా తెలియజేస్తున్నారు. 2018 లో ఈమె బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి భారీ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ప్రస్తుతం దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూనే టాలీవుడ్ లో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే బాలీవుడ్లో సింగం రిటర్న్స్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈమె గురించి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇదే నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు