Deepika Padukone: దీపికా పదుకొనే ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలుసా..?

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ ల జాబితాలో దీపికా పదుకొనే కూడా ఒకరు.. ఈ క్రేజ్ తోనే ఎన్నో భాషలలో పలు సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. హాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. అలా బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన దీపికా పదుకొనే ఈ రోజున 38వ బర్తడే జరుపుకోబోతోంది. బాలీవుడ్ నటుడు రణవీర్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.. వివాహమైన తర్వాత సినిమాలలో మరింత చురుకుగా నటిస్తూ భారీగానే సంపాదిస్తోంది.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దీపికా పదుకొనే ఏడాది సంపాదన ఎంత ఉంటుందనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే అభిమానులకు తన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. దీపికా పదుకొనే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్లలో కూడా నటిస్తూ భారీగానే సంపాదిస్తుంది.

కేవలం సినిమాలపరంగా కమర్షియల్ యాడ్ ల ద్వారా.. అలాగే పలు రకాల బిజినెస్ రంగంలో రాణిస్తున్న ఈమె ఏడాది సంపాదన దాదాపుగా రూ.60 కోట్లు ఉన్నట్లు సమాచారం.. దీపికా పదుకొనే ప్రతి సినిమాకి రూ .13 నుంచి రూ.15 కోట్ల వరకు అందుకుంటుందని తెలుస్తోంది. అలాగే ఎండార్స్మెంట్ కి రూ .7నుంచి రూ .10కోట్ల వరకు తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన ఈ ముద్దుగుమ్మ వీటి నుంచి కూడా భారీగానే సంపాదిస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది షారుక్ ఖాన్ తో కలిసి పఠాన్, జవాన్ లతో భారీ విజయాలను అందుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తూనే టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ప్రభాస్ తో కలిసి కల్కి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఊహకందని విజువల్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలియజేశారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు