Heroines: సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి పండుగ కి కూడా స్టార్ హీరోల , హీరోయిన్ ల చిత్రాలు విడుదల అవుతూ వుంటాయి. అలా విడుదలైన చిత్రాల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.. అయితే ఈ ఏడాది కూడా సంక్రాంతికి ఎన్నో చిత్రాలు విడుదల అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని చిత్రాలకి థియేటర్లు దొరకక సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.. అయితే ఈసారి సంక్రాంతికి సినిమాలు దాదాపుగా 250 కోట్ల రూపాయల రేంజిలో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.. కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో వస్తేనే ఈ చిత్రాలకు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

మరి ఈసారి సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో చాలామంది హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.. ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందనే నమ్ముతున్నారు.

నాగార్జున నటిస్తున్న నా సామిరంగ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్గా ఒకవేళ ఈ సినిమాతో సక్సెస్ వస్తే ఆమెకు వరుస ఆఫర్లు వెలువడతాయి.. వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది.. అలాగే హనుమాన్ చిత్రంతో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హీరోయిన్లకు ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరం అని చెప్పవచ్చు. మరి ఈ సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు ఈ ముద్దుగుమ్మలు.

- Advertisement -

మరోవైపు ఈగల్ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఈ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి నుంచి అధికారికంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 09న ఈ సినిమా విడుదల కాబోతుంది.

మరి ఏ స్థాయిలో తమ నటనతో అభిమానులను, ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. ఈ సంక్రాంతికి దాదాపుగా తెలుగుతోపాటు డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. మరి ఏ మేరకు బాక్స్ ఆఫీస్ వద్ద షేర్ రాబడతాయో చూడాలి మరి. ఈ సంక్రాంతి సినిమాలు విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది అంచనాలు సైతం ఊహించని రేంజ్ లో పెరిగిపోతున్నాయి. మరి ఏ హీరోయిన్ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు