Yash Movie: హీరో యశ్ టాక్సిక్ కోసం బాలీవుడ్ బ్యూటీ..?

Yash Movie: KGF చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో యశ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే తాను నటిస్తున్న తదుపరి చిత్రం టాక్సిక్ అనే సినిమాని ప్రకటించారు యశ్.. ఈ సినిమా కోసం ఇండియా లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ను విదేశాల నుంచి తీసుకువచ్చినట్లుగా తెలుస్తున్నది.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ ల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలోని నటీనటుల విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రధాన పాత్రలో నటించబోతోందని శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. గతంలో కేజిఎఫ్ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్.. యశ్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్-2 చిత్రంలో ఈమె ఒక కీలకమైన పాత్రలో నటించింది. అందులో రమికా సేన్ పాత్ర కూడా భారీ పాపులారిటీ అందుకుంది.

ఇప్పుడు అలాగే టాక్సిక్ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ ని యశ్ కి జోడిగా నటించేందుకు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే వెలువడలేదు.. కానీ బాలీవుడ్ తో పాటు కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ వార్త వైరల్ గా మారుతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక టాక్ షో లో కరీనాకపూర్ తనకు యశ్ అంటే చాలా ఇష్టమని.. తనతో నటించాలని ఉందని కూడా తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే ఈమెకు టాక్సిక్ చిత్రంలో అవకాశం వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

టాక్సిక్ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్ గా నటిస్తుందా లేకపోతే ఏదైనా సహాయ పాత్రలో నటిస్తోందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.. టాక్సిక్ సినిమా కోసం హీరోయిన్ సాయి పల్లవి పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది. మరి కరీనాకపూర్ ఏదైనా ప్రధాన పాత్రలో కాకుండా సహాయ పాత్రలో నటించే అవకాశం ఉన్నది.. టాక్సిక్ చిత్రం యాక్షన్ మూవీ డ్రగ్స్ నెట్వర్క్ చుట్టూ తిరిగే కథాంశం అన్నట్లుగా ఇటీవల విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి మళయాల నటి దర్శకురాలు నీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాలను రూపొందించేందుకు హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన డైరెక్టర్ జేజే పెర్రీ రూపొందిస్తున్నారట.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు