Sundeep kishan : వర్కింగ్ డే టెస్ట్ లో భైరవకోన పాసయ్యిందా?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన “ఊరుపేరు భైరవకోన” ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతూ ముందుకు సాగుతుంది. రిలీజ్ అయ్యాక మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ ట్విస్ట్ లు, డ్రామా ఆకట్టుకోవడంతో థియేటర్ల వద్ద బాగానే ఆడుతుంది. ఓవర్సీస్ లో అంతగా ప్రభావం లేకున్నా తెలుగు రాష్ట్రాల్లో మంచి కల్లెక్షన్లనే వసూలు చేస్తూ ముందుకు వెళ్తుంది ఈ సినిమా. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాను vi ఆనంద్ దర్శకత్వం వహించాడు.

గత రెండు వారాలుగా వచ్చిన ఏ సినిమా కూడా అంత బాగా లేకపోవడంతో ఆడియన్స్ కి ఏకైక ఆప్షన్ గా నిలవడం ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయింది. ఇక మూడు రోజుల వీకెండ్ కలెక్షన్స్ తో అదరగొట్టిన ఊరు పేరు భైరవకోన తాజాగా వర్కింగ్ డే లో అదరగొట్టింది. మరి సోమవారం వర్కింగ్ డే టెస్ట్ పాస్ అయిందా అంటే పరవాలేదనే చెప్పాలి. ఆదివారం వీకెండ్ తో పోలిస్తే 70 శాతం డ్రాప్స్ సొంతం చేసుకున్నప్పటికీ ఓవరాల్ గా డీసెంట్ అనిపించుకుంది. నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 55లక్షలు, వరల్డ్ వైడ్ గా 80 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా నాలుగురోజుల్లో 7. 75 కోట్ల షేర్, 15.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

అయితే ఊరు పేరు భైరవకోన బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా 3 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి. మరి తొలివారం ముగిసే సరికి ఎన్నికోట్లు కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు