Don3: సెట్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కియారా!

బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు రెగ్యులర్ గా వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ సినిమాలు అన్ని జోనర్లలోనూ తీయడం బాలీవుడ్ వాళ్ళకి అలవాటు. ముఖ్యంగా యాక్షన్ జోనర్ లో వచ్చిన సినిమాలు యావరేజ్ హిట్ అయినా దానికి సీక్వెల్స్ తీస్తూ ఉంటారు బాలీవుడ్ మేకర్స్. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన “డాన్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్(1978) కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే సినిమాని తెలుగులో ప్రభాస్ బిల్లా పేరుతో రీమేక్ చేసాడని తెలిసిందే.

ఇక దీనికి సీక్వెల్ గా డాన్2 కూడా రాగా అందులోనూ షారుఖ్ హీరో. అయితే ఇప్పడు డాన్3 కూడా తెరకెక్కుతుంది. ముందుగా షారుఖే ఈ సినిమాలోనూ నటిస్తాడని అనుకున్నా, ఆ తర్వాత రణవీర్ సింగ్ ని హీరోగా కంఫర్మ్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమాల్ని బాలీవుడ్ ప్రముఖ హీరో, డైరెక్టర్, సింగర్ అయిన “ఫర్హాన్ అక్తర్” డైరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే సీక్వెల్ ని డైరెక్టర్ ఫర్హాన్ అక్తరే తెరకెక్కిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఆగష్టు లో సినిమా అనౌన్స్ మెంట్ జరగగా, ఈ మధ్యనే సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇక ఈ సినిమా గత రెండు వారాలుగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, తాజాగా డాన్3 సెట్స్ లోకి హీరోయిన్ కియారా అద్వానీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్నీ మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ కెరీర్లో ఎప్పుడు చేయని రిస్కీ స్టంట్స్ చేయబోతోందని సమాచారం. ఇప్పటివరకూ గ్లామర్ రోల్సే చేసిన కియారా డాన్3 తో ఆక్షన్ మోడ్ లోకి దిగడం వల్ల తన కెరీర్ కి మంచి బూస్టప్ దొరికినట్టే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఇక టాలీవుడ్ లో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న ఈ భామ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక డాన్ 3 లో మొదటి రెండు పార్టుల్లో కనిపించిన ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. డాన్ సిరీస్ లో ఇదే చివరి సినిమా అని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు