Dheekshith Shetty : SLV సినిమాస్ బ్యానర్ లో కొత్త సినిమా షురూ!

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన నాని దసరా సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. నాని హీరోగా నటించిన ఆ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే గాకుండా ఫస్ట్ 100 కోట్ల మూవీగా నిలిచింది. అంతే కాదు ఆ సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ కి భారీ లాభాల్ని అందించింది. అయితే గత కొన్నేళ్లలో ఈయన నిర్మించిన సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా, కమెర్షియల్ గా అంత సక్సెస్ సాధించలేదు. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం.. ఇలా ఎన్ని సినిమాలు తీసిన ఆడియన్స్ పెదవి విరిచారు. ఆ తర్వాత చావో రేవో అన్నట్లుగా దసరా తీశారు. సమ్మర్ లో వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక దసరా తర్వాత అదే కాంబోలో అంటే, నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోనే ఇంకో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు చెరుకూరి సుధాకర్. ఈ లోపు ఒక చిన్న సినిమా తీద్దామని అంతా కొత్తవాళ్ళతో ఒక సినిమా స్టార్ట్ చేసారు. దసరా లో నాని ఫ్రెండ్ గా ఆకట్టుకున్న దీక్షిత్ ఈ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల కూడా ఇందులో మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. రంగబలి సినిమాతో ఆకట్టుకున్నయుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు ‘కింగ్ జాకీ క్వీన్’ అనే టైటిల్ పెట్టారు.

‘కేకే’ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా, ఈరోజే గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఒక టీజర్ వదిలారు.పూర్ణచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ వీడియో ఆకట్టుకోగా, ఇదొక క్రైమ్ సినిమాలా తెరకెక్కుతోందని తెలిసింది. ఇక శ్రీకాంత్ ఓదెల చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ సినిమా మార్చిలో రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు