The Goat life :రిలీజ్ కి సిద్ధమైన “ఆడుజీవితం”..

మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఆడు జీవితం” రిలీజ్ కి రెడీ అయింది. మలయాళం దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ బ్లేస్సి తనే నిర్మించి డైరెక్ట్ చేశాడు. ‘ఆడుజీవితం’ (‘ది గోట్ లైఫ్ )’, బెన్యామీన్ అనే వ్యక్తి రాసిన “గోట్ డేస్” అనే మలయాళ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. తాజాగా మూవీ మేకర్స్ ది గోట్ లైఫ్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ వారు కొనుక్కోవడం జరిగింది. AR రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను మలయాళం తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ సినిమాను మార్చి 28న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం జరిగింది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంతో రియలిస్టిక్ గా ఉంటూ, ప్రేక్షకులకి మంచి ఫీలింగ్ ని కలుగచేస్తుందని మేకర్స్ చెప్పడం జరిగింది.

ఇక ఆడు జీవితం సినిమా స్క్రిప్ట్ కోసం పదేళ్ల పాటు కష్టపడ్డానని, అలాగే సినిమా దాదాపు ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకుందని డైరెక్టర్ బ్లేస్సి అన్నాడు. అమలా పాల్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించడం జరిగింది. మరి మలయాళం లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నవల ఆధారంగా వస్తున్న ది గోట్ లైఫ్ తెలుగులో ప్రేక్షకులని ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు