Varun Tej : అప్డేట్ కోసం మెగా ఫ్యామిలీనీ వదలని ఫ్యాన్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “గేమ్ ఛేంజర్” అప్డేట్ పై అటు శంకర్ గాని, ఇటు దిల్ రాజు గాని ఎవ్వరూ స్పందించడం లేదు. ఇటు రామ్ చరణ్ మాత్రం సినిమా షూటింగ్ లో బిజీగానే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా రామోజీ ఫిలింసిటీ లో పలు ఆక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారని మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. ఇక ఈ షెడ్యూల్ గనుక పూర్తయితే సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయినట్టే అని టాక్ నడుస్తుంది. కానీ సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ తప్ప మరో అప్డేట్ రాలేదు. అప్డేట్ వచ్చి కూడా దాదాపు ఏడాది కావస్తుంది. లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన ఫస్ట్ లుక్ మినహా ఇప్పటివరకు కూడా మరో అప్డేట్ లేదు. తిరిగి తిరిగి మళ్ళీ రామ్ చరణ్ బర్త్ డే నే వచ్చేస్తుంది.

అయితే ఎలా చూసినా మేకర్స్ నుండి అప్డేట్స్ రాకపోయే సరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓపిక నశించిపోయి మెగా ఫ్యామిలీ ఎక్కడ కనబడితే అక్కడ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం బతిమిలాడడం స్టార్ట్ చేశారు. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ లాంచ్ జరగగా అక్కడికి వచ్చిన చరణ్ ఫ్యాన్స్ వరుణ్ తేజ్ ని రిక్వెస్ట్ చేస్తూ గేమ్ ఛేంజర్ అప్డేట్ చరణన్నని నువ్వైనా అడిగి తెలుసుకో అన్నా అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసారు.

దీనికి రిప్లై ఇచ్చిన వరుణ్ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే నేను రోజు అదే అడుగుతూ ఉన్నాను, ఈరోజు మార్నింగే షూటింగ్ స్టార్ట్ అయింది. చరణన్న తో పొద్దున్నే మాట్లాడాను, నాకు తెలిసి తొందర్లోనే క్రేజీ అప్డేట్ అందుతుంది అన్నాడు. అయితే ఒక్క వరుణ్ కే కాదు, గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఏకంగా చిరుని కూడా వదల్లేదు ఫ్యాన్స్. పద్మవిభూషణ్ వచ్చినందుకు అమెరికాలో ఫ్యాన్స్ ఏర్పాటుచేసిన సన్మాన సభకి వెళ్లిన చిరు స్టేజి పై మాట్లాడుతున్నా కూడా అక్కడ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ చెప్పని అన్నారు. అయితే దీనిపై చిరు ఎక్కడ లీక్ చేస్తానేమోనని చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నారు. మరి దిల్ రాజు ఇప్పటికైనా మేల్కొని ఫ్యాన్స్ ని చల్లబరిచే ప్రయత్నం చేయాలనీ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు