Lifestyle : ఇలాంటి లక్షణాలు ఉంటే చచ్చినా జీవితంలో బాగుపడరు… మీరూ ఇంతేనా?

లైఫ్ లో సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చాలామందికి అది తీరని కోరికగానే మిగిలిపోతుంది. జీవితంలో అనుకున్న విధంగా టార్గెట్ ను రీచ్ అవ్వడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని లక్షణాలు, అలవాట్లతో పాటు సంకల్ప బలం ఉండాలి. లేదంటే కోరుకున్న తీరాలను చేరడం కష్టమే. లైఫ్ లో సక్సెస్ కానీ చాలామందికి కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి. వాటి వల్ల వాళ్లు జీవితంలో ముందుకు సాగలేరు. ఒకవేళ మీలో కూడా అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇంతకీ లైఫ్ లో సక్సెస్ కాకుండా అడ్డుకోగలిగే ఆ లక్షణాలు ఏంటి అంటే…

రిస్క్ భయం
లైఫ్ లో సక్సెస్ కాలేని వాళ్లలో కనిపించే అత్యంత సాధారణమైన లక్షణం రిస్క్ తీసుకోవాలంటే భయపడడం. చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడి కంఫర్ట్ జోన్ లోనే ఉండడానికి ఇష్టపడతారు. దీనివల్ల డెవలప్మెంట్ అనేది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ఏం చేసినా సరే రిస్క్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. కొత్త ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేదా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినా… ఇలా లైఫ్ లో ఎదగడానికి చేసే ఏ పనిలోనైనా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. భయం అనేది మిమ్మల్ని కొత్త ప్రయత్నాలు చేయకుండా అడ్డుకుంటుంది. అందుకే రిస్క్ అనేది జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తే అది మీ విజయానికి నిచ్చెనగా ఉపయోగపడుతుంది.

వాయిదా వేయడం
ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనులను ఎప్పుడో ఒకసారి వాయిదా వేస్తూనే ఉంటారు. అయితే రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల అదొక జీవితాన్ని నాశనం చేసే అలవాటుగా మారవచ్చు. వాయిదా వేయడం అనేది సమస్యగా మారి ఒత్తిడి, అపరాధ భావాన్ని పెంచుతుంది. గడువు దగ్గర పడుతున్న కొద్ది ఆందోళన మరింతగా పెరుగుతుంది. దీంతో మీకు తెలియకుండానే చేయాల్సిన పని ఇంత ఆలస్యం అవుతుంది. ఆ లూప్ లో చిక్కుకుంటే పని మరింత కష్టతరం అవుతుంది. కాబట్టి దీని నుంచి విముక్తి పొందాలంటే క్రమశిక్షణ పెంచుకోవడంతో పాటు ఆలోచనా విధానంలో మార్పు రావడం ముఖ్యం. పని చిన్నదైనా, పెద్దదైనా వాయిదా వేయకుండా చేయడం వల్ల సక్సెస్ ఫుల్ గా ముందడుగు వేయగలుగుతారు.

- Advertisement -

నెగిటివిటీ
లైఫ్ లో సక్సెస్ కాకుండా ఆపగలిగే మరో లక్షణం నెగిటివిటీ. చాలామంది నెగటివ్ అంశాలపై దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేసుకుంటారు. ముఖ్యంగా ఏది కరెక్ట్ అనే విషయాన్ని ఆలోచించకుండా ఏది తప్పు అనే దానిపై మాత్రమే దృష్టి పెడతారు. ఈ ఆలోచనా విధానం జీవితంలో ముందుకు సాగకుండా మరింత బలహీన పరుస్తుంది. మోటివేషన్ ను తగ్గించడమే కాకుండా ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. చాలెంజెస్ ఎదురైనప్పుడు వాటిని తమ డెవలప్మెంట్ కు మంచి అవకాశం గా చూడకుండా, అధిగమించలేని అడ్డంకులుగా చూస్తున్నారు అంటే… వాళ్లు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు.

వీటితో పాటు క్రమశిక్షణ లేకపోవడం, వ్యక్తిగత ఎదుగుదల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఓడిపోతామేమోనని భయపడడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇతరుల అభిప్రాయాన్ని అంగీకరించలేకపోవడం వంటివి కూడా మిమ్మల్ని విజయం వైపు అడుగేయకుండా వెనక్కిలాగే లక్షణాలే. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడి సక్సెస్ వైపు మొదటి అడుగు వేయండి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు