Vishal: త్రిష పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పొలిటీషియన్..నటి ఘాటు రిప్లై..అండగా విశాల్..!

టాలీవుడ్ , కోలీవుడ్ లో హీరోయిన్ త్రిష ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. త్రిష గురించి ఈ మధ్యకాలంలో నిత్యం ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గతంలో నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ త్రిష పై చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి.. ఇప్పుడు తాజాగా తమిళనాడుకు చెందిన ఏవీ రాజు అనే ఒక పొలిటీషియన్ త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల కోసం త్రిష ఒక పొలిటీషియన్ తో గడిపింది అంటూ ఆయన చాలా అసభ్యకరంగా మాట్లాడారు.

దీంతో ఈ విషయం ఇప్పుడు అటు తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా త్రిష స్పందిస్తూ.. కొంతమంది అల్పులు వేరే వాళ్ళ జీవితాల పైన ఆధారపడి బ్రతికే వాళ్ళు.. అటెన్షన్ కోసం ఎంతటి దారుణానికైనా దిగజారుతారనే విషయం తెలిసి చాలా బాధ కలుగుతుంది అంటూ తెలిపింది. అంతేకాకుండా ఇక మీదట తన లీగల్ టీం ఈ విషయం పై ముందుకు వెళుతుంది అంటూ త్రిష వెల్లడించారు. ఇప్పుడు ఈ విషయాలు కాస్త వైరల్ గా మాడడంతో తాజాగా హీరో విశాల్ కూడా స్పందిస్తూ.. త్రిషకి అండగా నిలిచారు..

ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివి తక్కువ మూర్ఖుడు మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి ఇలా అసహ్యంగా మాట్లాడడం నేను విన్నాను.. మీరు పబ్లిసిటీ కోసమే చేశారని నాకు తెలుసు.. అందుకే మీ పేరు లేదా మీరు టార్గెట్ చేసిన వ్యక్తి పేరును సైతం నేను అసలు ప్రస్తావించాలనుకోలేదు.. మీ ఇంట్లో ఉండే స్త్రీలు మీరు చేసిన ఈ పని తర్వాత.. మీకు లేకపోయినా వారికి మనస్సాక్షి ఉంటే ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను అంటూ తెలిపారు.. ఈ ట్వీట్ చేయడం కూడా తనకు చాలా బాధ కలిగించింది అంటూ తెలిపారు.

- Advertisement -

నిజానికి ఈ విషయం పై నీలాంటి వ్యక్తులను ఖండించాలంటే నాకు ఇష్టం లేదు.. మీరు నరకంలో కుళ్ళిపోతారని ఆశిస్తున్నానంటూ ఆ పొలిటికల్ లీడర్ పైన విశాల్ ట్వీట్ చేశారు.. ఒక కళాకారుడి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఇలా మాట్లాడాలనే ఉద్దేశం లేదు.. కానీ మానవునిగా మీరు భూమి పైన ఎప్పటికీ ఉండలేరు ఉన్నంత వరకూ మంచిగా ఉండండి అంటూ డబ్బుల కోసం సెలబ్రిటీల పైన నెగెటివ్ చేసి డబ్బు సంపాదించుకోవాలని ప్రయత్నాలు మాత్రం చేయకండి అంటూ తెలిపారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు