HBD Vedhika : ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఈ ఇయర్ కలిసొచ్చేనా?

టాలీవుడ్ లో టాలెంట్ ఉండి లక్ కలిసి రాని హీరోయిన్లలో వేదిక ఒకరు. ఈ అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయమై పదిహేనేళ్ల పైనే అయినా, ఇప్పటివరకూ నిలదొక్కుకోలేకపోయింది. చూడ్డానికి చాలా అందంగా అట్రాక్టీవ్ గా ఉన్నా సరైన హిట్లు లేక అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో బాణం అనే సినిమాతో మంచి హిట్టు కొట్టి నటిగానూ మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి మళ్ళీ సరైన సినిమా కోసం చాలా ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఇక్కడి కంటే కాస్త బెటర్ గా తమిళ్ లో అవకాశాలొచ్చినా అక్కడ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ అయితే రాలేదు.

అందుకే మళ్ళీ టాలీవుడ్ ని నమ్ముకుంది. అయితే అనూహ్యంగా ఈ ఇయర్ లో వేదిక చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇందులో కొన్ని లాస్ట్ ఇయరే మొదలైనా, ఇంకా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక మార్చి 1న వేదిక కీలక పాత్రలో నటించిన రజాకార్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటు వేదిక మెయిన్ లీడ్ గా ‘ఫియర్’ అనే హారర్ సినిమా తెలుగులో తెరకెక్కబోతుంది. అలాగే జంగల్ అనే సినిమా లోనూ నటిస్తుంది. ఇవే కాక తమిళ్, మలయాళం, కన్నడలో ఒక్కో సినిమా చేస్తూ మరో మూడు సినిమాల్తో బిజీ అయింది వేదిక.

చూస్తూ చూస్తూ అరడజను సినిమాల్లో నటిస్తుంది ఈ భామ. ఈ సినిమాలన్నీ 2024 లోనే రిలీజ్ కానున్నాయి. మరి ఈ సంవత్సరం వీటిలో ఒక్క సినిమా హిట్ అయినా ఈ అమ్మడు మళ్ళీ బిజీ అవడం ఖాయం. పైగా ఈ రోజు వేదిక బర్త్ డే ఈ సందర్బంగా పలు సినిమాల మేకర్స్ ఈమెకి విష్ చేస్తూ సినిమాల అనౌన్స్ మెంట్స్ కూడా చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం వేదిక కి లక్కీ ఇయర్ గా మారాలని filmify తరపున బర్త్ డే విషెస్ ని తెలియచేస్తున్నాము.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు