Vishal: న్యూయార్క్ లో అమ్మాయితో వీడియో పై అసలు విషయాన్ని చెప్పేసిన విశాల్..!!

కోలీవుడ్ , టాలీవుడ్ లో హీరో విశాల్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల హీరో విశాల్ ఒక అమ్మాయితో తిరుగుతున్నట్టు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.. ఈ వీడియోలో విశాల్ ఒక అమ్మాయి తో న్యూయార్క్ రోడ్ల పైన తిరుగుతూ కనిపించారు.. ప్రస్తుతం విశాల్ వయసు 46 ఏళ్ళు వచ్చినా ఇంకా వివాహం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉంటున్నారు. అందుకే అభిమానులు తన పెళ్లి విషయం గురించి శుభవార్త వినాలని ఎదురుచూస్తున్నారు.

గతంలో కూడా హీరో విశాల్ రెండుసార్లు వివాహం ఫిక్సయి పలు కారణాల చేత ఆగిపోవడం జరిగింది.. ఇటీవల న్యూయార్క్ వీధుల్లో ఒక అమ్మాయి తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు విశాల్.. న్యూయార్క్ లో అమ్మాయి భుజం పైన చెయ్యి వేసుకుని మరీ రోడ్డుపైన నడుస్తూ ఉన్నట్టుగా కనిపించారు.. అయితే అక్కడ కొంతమంది విశాల్ ని గుర్తుపట్టి.. ఆ వీడియోలను కెమెరా లో బంధించడం జరిగింది. దీంతో ఇది గమనించిన విశాల్ జర్కిన్ తో తన ముఖాన్ని కవర్ చేసుకొని ఆ అమ్మాయితో కలిసి పరుగులు పెట్టారు.

ఆ అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త తీసుకోవడంతో విశాల్ ఈమెతో ప్రేమలో పడ్డాడేమో అన్నట్లుగా ఎక్కువగా రూమర్స్ వినిపించాయి
ఈ క్రమంలోనే హీరో విశాల్ వరకు ఈ విషయం వెళ్లగా ఈ విషయం పైన స్పందించారు..”క్షమించండి అబ్బాయిలు.. ఇటీవల వీడియో గురించి అసలు నిజాన్ని వెల్లడించడానికి ఇది సరైన సమయం అనుకుంటున్నాను అంటూ తెలియజేశారు.. లోకేషన్ పరంగా ఇది సగం నిజమని అన్నారు.. అవును నేను న్యూయార్కులో ఉన్నది నిజమే అది నా కజిన్ తో నేను రెగ్యులర్ గా చిల్ అయ్య ప్లేస్ అని తెలిపారు”..

- Advertisement -

తమ బంధువులు అందరూ కూడా క్రిస్మస్ రోజున ఇలాంటి ఫ్రాంక్ పని చేయాలని నిర్ణయించుకున్నాము.. తన కజిన్ కూడా ఒక ఫ్రాంక్ కి స్వయంగానే తానే దర్శకత్వం వహించిందని తెలిపారు విశాల్.. అంటూ మొత్తానికి అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.. చివరికి ఇది ఫ్రాంక్ వీడియో అంటూ కూడా తెలియజేశారు విశాల్..

Vishal told the real thing on video with the girl in New York
Vishal 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు