Tillu 2: ఆ డైరెక్టర్ పై సీరియస్ అవుతున్న అనుపమ ఫ్యాన్స్..!

టాలీవుడ్ లో ప్రేమమ్ తో ఎంట్రీ ఇచ్చి అఆ లో సమంత కి ధీటుగా నటించి క్రేజీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో యూత్ క్రష్ లిస్ట్ లో యాడ్ అయిన ఈ భామ పొట్టి పిల్లే అయినా క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఇక రీసెంట్ గా ఈ హీరోయిన్ నుండి వస్తున్న సినిమాలు అంతగా ఆడకపోయినా, సోషల్ మీడియా లో ఆమె ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ఇక అనుపమ నటిస్తున్న తాజా చిత్రం టిల్లు2. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెండేళ్ల కింద వచ్చిన డీజే టిల్లు కి సీక్వెల్ గా వస్తుంది. ఇక ఈ సీక్వెల్ లో హీరోగా సిద్ధుయే మళ్ళీ నటిస్తున్నా, హీరోయిన్ గా మాత్రం అనుపమ నటిస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుండి అనుపమ ఫ్యాన్స్ కి మాత్రం అంతగా నచ్చడం లేదని టాక్. ఇక న్యూ ఇయర్ స్పెషల్ గా తాజాగా రిలీజ్ చేసిన స్టిల్ కూడా అంతగా నచ్చలేదని సోషల్ మీడియా లో అనుపమ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే అనుపమ ఇంతకు ముందు చేసిన సినిమాల్లో డీసెంట్ గా నటిస్తూ, తన గ్లామర్ షో కంటే, నటనకి స్కోప్ ఉన్న పాత్రలతోనే మెప్పించింది. గ్లామర్ షో ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసినా అంతగా ఓవర్ చేయలేదు. అయితే ప్రస్తుతం నటిస్తున్న టిల్లు2 లో గ్లామర్ షో చేస్తుందని పోస్టర్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. అదీ గాక డీజే టిల్లు లో నేహా శెట్టి ని చూపించినట్టు నెగిటివ్ గా చూపిస్తే అస్సలు ఒప్పుకోమని ఈ సినిమా డైరెక్టర్ మల్లిక్ రామ్‌ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు అనుపమ ఫ్యాన్స్.

- Advertisement -

Anupama Glamor Show in Tillu2

అయితే అనుపమ ని కూడా ఇందులో కొంచెం నెగిటివ్ గానే చూపిస్తున్నారా? లేక ఈ హీరోయిన్ తో హీరోని కమిట్ చేసి టిల్లు మూవీ కి శుభం కార్డు వేస్తారా? అని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఎదురుచూస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు