Sankranthi Movies: తెలుగు సినిమాలకు రూట్ క్లియర్ చేసిన తమిళ హీరోలు

Sankranthi Movies : ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు తెలుగు సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉంటే, కొన్ని తమిళ సినిమాలు కూడా ఈ సంక్రాంతికే టాలీవుడ్ థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యాయి. దీంతో ఈసారి పండగ సీజన్లో ఒకేసారి ఇన్ని సినిమాలు రాబోతుండడంతో ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఏ సినిమాకు వెళ్లాలి అనే ఆలోచనలో పడ్డారు. తెలుగు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు తమిళ సినిమాలు కూడా అదే టైంలో థియేటర్లలోకి వస్తూ ఉండడం చర్చకు దారి తీసింది. కానీ తాజా సమాచారం ప్రకారం తమిళ హీరోలు సైడ్ అయిపోయి తెలుగు సినిమాలకు రూట్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ సంక్రాంతికి తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావాల్సిన కెప్టెన్ మిల్లర్, అయాలాన్ సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆయా హీరోల కెరీర్ లోనే రికార్డ్ స్థాయి బడ్జెట్తో రూపొందుతున్నాయి. దీంతో అన్ని భాషల్లోనూ వీటిని కూడా రిలీజ్ చేయడానికి ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్నారు. అయితే తెలుగులో సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో ఇద్దరు హీరోలు తమ సినిమాలను తెలుగులో మాత్రం వాయిదా వేసుకుంటున్నారు.

అయితే తమిళ విషయంలో మాత్రం ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న రిలీజ్ కాబోతున్నాయి. ధనుష్ “కెప్టెన్ మిల్లర్”, శివ కార్తికేయన్ “అయాలాన్” సినిమాలు కేవలం తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ కాబోతున్నాయి. తెలుగులో మాత్రం వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే “కెప్టెన్ మిల్లర్” నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని “అయాలాన్” డిస్ట్రిబ్యూటర్లు తమ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాల తెలుగు వెర్షన్ ఒకటి లేదా రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ కాబోతున్నాయని సమాచారం.

- Advertisement -

ఇక ఇప్పటికే రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న “లాల్ సలామ్” మూవీ కూడా రిలీజ్ డేట్ సమస్యతోనే పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమాను అన్ని చోట్ల ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ వాయిదా వేశారు. మొత్తానికి అనుకోకుండా ఈ తమిళ సినిమాలన్నీ పక్కకు తప్పుకుని, తెలుగు సినిమాలకు రూట్ ని క్లియర్ చేశాయి. ఇక ఈ సంక్రాంతికి మహేష్ బాబు “గుంటూరు కారం”, నాగార్జున “నా సామి రంగ”, రవితేజ “ఈగిల్”, తేజ సజ్జ “హనుమాన్”, వెంకటేష్ “సైంధవ్” సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇక ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ అంతా తెలుగు సినిమాల మధ్య ఉండబోతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు