2023 Recap : 2023 ఇంతమంది హీరోలకు బ్యాడ్ ఇయరా?

2023 Recap : 2023 రౌడీ హీరోకు బ్యాడ్ ఇయర్ గా గడిచింది. ఒక్క నానిని మినహాయిస్తే టైర్ 2 హీరోలు అందరికీ ఈ ఏడాది దారుణంగా గడిచింది. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం 2023లో దసరా, హాయ్ నాన్న అనే రెండు చిత్రాలతోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి స్పెషల్ గా నిలిచాడు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ లో జీరోగా నిలిచిన స్టార్ ఎవరు అంటే…

విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఒకే ఒక్క మూవీతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నం చేశాడు. “ఖుషి” అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ దేవరకొండ హీరో, హీరోయిన్ గా సమంత నటించడం, రిలీజ్ కి ముందు పాటలు బాగా వైరల్ అవ్వడంతో భారీ అంచనాలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇక దేవరకొండ కూడా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు. కానీ అనూహ్యంగా “ఖుషి” మూవీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ఒక వారం థియేటర్లలో నెట్టుకు రాగలిగింది.

కానీ ఆ తర్వాత మాత్రం రౌడీ హీరో మూవీ తన జోరును కొనసాగించలేకపోయింది. ఇలా ఈ ఏడాది ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన హీరోగా విజయ్ దేవరకొండ మిగిలిపోయాడు. ఇక ఈయనతో పాటు సాయి ధరం తేజ్, నాగచైతన్య, అఖిల్, గోపీచంద్, నితిన్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా దారుణమైన ఫ్లాప్ లను ఈ ఏడాది తమ ఖాతాలో వేసుకున్న హీరోల లిస్ట్ లో చేరిపోయారు.

- Advertisement -

సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” మూవీతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకోవడంతో ఈ హీరో మళ్లీ తన జోరుని కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి “బ్రో” అంటూ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. ఈ మూవీలో తేజ్ నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సాయి ధరం తేజ్ మళ్లీ ఫిట్ గా మారడానికి ఒక సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో “గంజా శంకర్” అనే మూవీ చేస్తున్నాడు ఈ మెగా హీరో.

ఇక అక్కినేని నట వారసులు అఖిల్ “ఏజెంట్” మూవీతో, నాగ చైతన్య “కస్టడీ” మూవీతో ఏడాది తమ కెరీర్ లోనే మర్చిపోలేని డిజాస్టర్ లను అందుకున్నారు. గోపీచంద్ “రామబాణం”, నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”, వైష్ణవ్ తేజ్ “ఆదికేశవ”, వరుణ్ తేజ్ “గాంధీవదారి అర్జున” సినిమాలతో వచ్చి, ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఈ అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక వీళ్లతో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఏకంగా రెండు పరాజయాలను చవిచూశాడు. రవితేజ హీరోగా నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తీవ్రంగా నిరాశపరిచాయి. నిఖిల్ “స్పై”, నాగశౌర్ “రంగబలి”, “ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి” మూవీతో రెండు ప్లాప్ లు తన ఖాతాలో వేసుకున్నారు. కాబట్టి మిడ్ రేంజ్ హీరోలు అందరికీ 2023 బ్యాడ్ ఇయర్ గా మిగిలిపోయింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు