Hansika Motwani : మరో హీరోయిన్

హీరోయిన్లు ఈ మధ్య కాలంలో ఒక్కకరుగా ఓ ఇంటి వాళ్లవుతున్నారు. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ గా పేరున్న నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా తన లవర్ రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడింది. అలాగే హీరోయిన్ పూర్ణ కూడా ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకుంది. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హన్సికా మోట్వాని. ఈ 32 ఏళ్ల భామ అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు కోలీవుడ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వరుడు ఎవరంటే.. సౌత్ ఇండియాలో ఒక పెద్ద రాజకీయ నాయకుడి కుమారుడని సమాచారం. అతను ప్రస్తుతం వ్యాపార రంగంలో బాగా స్థిరపడి ఉన్నట్లు తెలుస్తుంది.

వీరి వివాహంపై ఇరు కుటుంబాలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. దీంతో అతి త్వరలోనే హన్సిక ఎంగేజ్ మెంట్ జరుగబోతుందని టాక్. ఎంగేజ్ మెంట్ డేట్ ను ఫిక్స్ చేయడానికి ఇరు కుటుంబాలు త్వరలోనే మరోసారి కలుస్తాయని తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమో కాదో అనే దానిపై హీరోయిన్ హన్సిక ఇప్పటి వరకు స్పందించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు