Allu Arjun: ఆ విషయంలో భర్తకు పోటీగా అల్లు స్నేహ.. గట్టి పిండమే..!

 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో 9.1 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె.. తనకు, తన భర్తకు అలాగే తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా తన భర్త అల్లు అర్జున్ కి పోటీగా వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు సమాచారం. అల్లు అర్జున్ సినిమాల ద్వారా సంపాదిస్తుంటే.. అల్లు స్నేహ ఇలా ఇంట్లో ఖాళీగా ఉండకుండా బిజినెస్ మొదలుపెట్టిందట. అంతేకాదు దీని ద్వారా బాగా సంపాదిస్తుందని కూడా సమాచారం.

- Advertisement -

అల్లు స్నేహ స్థాపించిన పికాబు సంస్థ ఇప్పుడు మరింత విస్తరిస్తోంది. అందులో భాగంగానే ఫైర్ ఫ్లై కార్నివాల్ జనవరి 20న ఎన్ కన్వెన్షన్ హాల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు అల్లు స్నేహ.. ఈ కార్నివాల్ లో చికరమైన వంటలు, షాపింగ్ , ఎంజాయ్మెంట్ యాక్టివిటీస్ , లైవ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయట. ఇక ఈ ఈవెంట్ జనవరి 20న హైదరాబాదులోని మాదాపూర్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తానికి అయితే తన భర్తతో పోటీగా సంపాదించడానికి సిద్ధమయ్యింది అల్లు స్నేహ రెడ్డి. ఈ విషయం తెలిసి సంపాదనలో ఈమె గట్టి పిండమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే… పుష్ప 2 సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీతో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024 అక్టోబర్లో ప్రారంభం కానుంది అని సమాచారం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు