Hanuman : హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. రిజల్ట్ ఇదే..!

ఒకపక్క అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుండగా.. మరొకవైపు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా హనుమాన్.. జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే గురువారం అనగా జనవరి 11వ తేదీన సాయంత్రం 6:15 గంటలకు పెయిడ్ ప్రీమియర్ షోలు మొదలు కాబోతున్నాయి. మొత్తం 150 షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్ చేశారు. అంతే కాదు షోస్ అన్ని హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులలో క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ చెప్పవచ్చు. అయితే ఒకవైపు సినిమాపై విపరీతంగా బజ్ ఉంటే.. మరొకవైపు ఫస్ట్ రివ్యూ అందుకు భిన్నంగా ఉందని చెప్పాలి.

అసలు విషయంలోకి వెళ్తే.. సినిమా విడుదలకు ముందు ట్విట్టర్ రివ్యూ పోస్ట్ చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఉమైర్ సందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల రివ్యూలు ఎక్కువగా ట్వీట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తాను దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పే ఈయన తాజాగా హనుమాన్ గురించి తన రివ్యూ ఇవ్వడం జరిగింది. తాజాగా ఉమైర్ సందు..” హనుమాన్ ఫ్లాట్ గా ఉంది .. ఇది ఓకే సినిమా.. బిలో యావరేజ్” అంటూ ఉమైర్ సందు సోషల్ నెట్వర్కింగ్ సైట్ X లో పేర్కొన్నారు.

అయితే ఈయన రివ్యూ పై మిశ్రమ స్పందన లభిస్తోంది.” ఒక ముస్లిం గా నీ పని నువ్వు సక్రమంగా నిర్వర్తించావు .. మెచ్చుకోదగిన విషయం” అని ఒకరు రిప్లై ఇవ్వగా .. మరొకరు.. ” భూమ్మీద ప్రతి ఒక్కరు నీ రివ్యూ కోసం ఎదురు చూసి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారని ఫీల్ అవుతున్నావా.. సోషల్ మీడియాలో ఇలా చెప్పడం కంటే థియేటర్లలో పాప్ కార్న్ అమ్ముకోవడం మంచిది” అంటూ ఉమైర్ సందుకి రిప్లై ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా హనుమాన్ భారీ విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలే కాదు సామాన్య సినీ ప్రేక్షకులకు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంక్రాంతికి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల విడుదలవుతున్నప్పటికీ కూడా వాటితో పాటు తమ సినిమా కూడా చూస్తారన్న ధైర్యంతో హనుమాన్ సినిమాని రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. పెయిడ్ ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ఈ సినిమా బృందానికి ఇప్పుడు షాక్ ఇచ్చేలా ఓవర్సీస్ నుంచి ఉమైర్ సందు ఫస్ట్ రివ్యూ ఇవ్వడం గమనార్హం. మరి ఉమైర్ సంధు చెప్పినట్టు ఈ సినిమా బిలో యావరేజ్ గా ఉందా లేక బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా అన్నది సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు