Hanuman: పెయిడ్ ప్రీమియర్స్… ఈ స్ట్రాటజీతోనే గురూజీని ఎదుర్కోబోతున్నారా?

Hanuman: ఇప్పుడు టాలీవుడ్ లో అందరి దృష్టి సంక్రాంతి సినిమాలపై, అందులోనూ “గుంటూరు కారం”, “హనుమాన్” సినిమాలపైనే ఉంది. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “గుంటూరు కారం” మూవీకి ఏ రకంగా చూసినా “హనుమాన్” అనే చిన్న సినిమా పోటీ కానే కాదు. కానీ తమ సినిమాకు పోటీగా రిలీజ్ అవుతున్నందున “హనుమాన్” మూవీకి థియేటర్లు దక్కకుండా చేశారు అనే వివాదం తెరపైకి రావడమే ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఉంది అనిపించేలా చేసింది.

నైజాంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ థియేటర్లలో, అలాగే జనవరి 12న హైదరాబాదులోని మల్టీప్లెక్స్ లలో ఉదయం 1 గంటకు లేదా 4 గంటలకు స్పెషల్ షోలు వేయబోతున్నట్టుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అసలే థియేటర్లో సమస్యతో అల్లాడుతున్న “హనుమాన్” పని అయిపోయినట్టేనని అంతా భావించారు. కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టడం తప్ప వేరే ఛాన్స్ లేదనే అభిప్రాయానికి వచ్చేసారు. ఇక “హనుమాన్” మేకర్స్ కూడా అదే ఆశతో ముందుకు వెళ్తున్నారు. కానీ తాజాగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

పెయిడ్ ప్రీమియర్స్ స్ట్రాటజీతో గురూజీ రూపొందిస్తున్న “గుంటూరు కారం”ను ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నారు “హనుమాన్” టీం. తెలుగు రాష్ట్రాల్లో “హనుమాన్” పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ తెలుగు సూపర్ హీరో మూవీ “హనుమాన్” జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ కంటెంట్, రిజల్ట్ పై మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. అందుకే సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

జనవరి 11న సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. హనుమాన్ టీం సెలెక్ట్ చేసిన లొకేషన్లలో షోస్ ఉండబోతున్నాయి. ఇప్పటికే అమలాపురంలో విపిసి కాంప్లెక్స్ లో 9PM షో, వైజాగ్ లోని జగదాంబ థియేటర్లో 6:30 pm షోలకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ కాగా, కేవలం 30 నిమిషాల్లో హాట్ కేకుల్లా అన్ని టికెట్స్ అమ్ముడుపోయాయనీ సమాచారం. ఇక శరత్, ఎస్టిబిఎల్ వంటి ఇతర థియేటర్లలో కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు.

ప్రస్తుతం సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాల కంటే “హనుమాన్” మూవీ పైనే మంచి బజ్ ఉంది. ఒకవేళ పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిందంటే గనక “హనుమాన్” టీం జాక్ పాట్ కొట్టినట్టే. “గుంటూరు కారం” మూవీని పక్కన పెట్టి మరీ ఆడియన్స్ ఈ మూవీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి పెయిడ్ ప్రీమియర్స్ ఎఫెక్ట్ “హనుమాన్” మూవీపై ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు