Aditi-Siddharth : మరోసారి దొరికేశారు..

సౌత్ లో లవర్ బాయ్ పేరుతో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ, ఎప్పుడు యంగ్ లుక్ తో కనిపించే సీనియర్ హీరో సిద్ధార్థ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. 43 ఏళ్ల వయసు ఉన్న ఈ హీరో గురించి ఎప్పుడైనా వార్తలు వచ్చాయంటే.. అది డేటింగ్ గురించే అయి ఉంటుంది. ఇప్పటికే ఈ చాక్లేట్ బాయ్.. సోహా అలీఖాన్, శ్రుతిహాసన్, సమంతతో డేటింగ్ చేశాడని అందరికీ తెలిసిందే. పెళ్లి అయి.. డైవర్స్ తీసుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని కొద్ది రోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హైదరాబాద్ బ్యూటీ అదితి రావు హైదరీ. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే ఈ హీరోయిన్.. సిద్ధార్థ్ తో చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉందని ప్రచారం సాగుతుంది. వీళ్లు క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం పై వీళ్లు ఇప్పటి వరకు స్పందించకపోవడం.. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

తాజాగా వీరి గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. అదితి రావు హైదరీ పుట్టిన రోజును సెలబ్రెట్ చేసుకోవడానికి ఈ జంట ముంబై నుంచి చెన్నైకి వచ్చారట. ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డేటింగ్ గురించి స్పందించకుండా.. వారిపై వస్తున్న వార్తలను పట్టించుకోకుండా.. తెగా షికార్లు కొడుతున్నారని నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. కాగా నేడు అదితి రావు హైదరీ 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అయినా వీరి ప్రేమ వ్యవహారం గురించి అధికారిక ప్రకటన చేస్తారా? లేదా ఇలాగే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ మరింత కాలం డేటింగ్ లో ఉంటారా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు