Samantha : ప్రేమలో పడిపోయా

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు స‌మంత‌. 2010లో మొదటి సారి ఏ మాయ చేసావే అనే సినిమాతో హీరోయిన్ గా అరగేట్రం చేసిన సామ్.. కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం సౌత్ లోనే ఫేమస్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన స‌త్తా చూపించడానికి సిద్ధమవుతుంది. ఇది ఇలా ఉండగా.. సమంత ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ లలో యశోద ఒకటి.

హరి, హరిష్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ‘యశోద’ తెరకెక్కుతుంది. ఈ చిత్రం వచ్చే నెల 11వ తేదీన పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. తెలుగు వర్షెన్ ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడదల చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో సమంతపై ఉన్న అభిమానాన్ని విజయ్ ఇలా చాటుకున్నాడు.

”సమంతతో నేను ప్రేమలో పడ్డాను. నేను కాలేజీలో చదువుతున్న సమయంలోనే సామ్ ను వెండితెరపై చూశాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనను నేను అభిమానిస్తూనే ఉన్నాను. ఈ రోజు సమంత నటిస్తున్న యశోద ట్రైలర్ ను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది” అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. అలాగే యశోద టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. య‌శోద ట్రైల‌ర్ న‌వంబ‌ర్ 11న విడుద‌ల కాబోయే సినిమాపై భారీ అంచనాల‌ను పెంచేసింది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం వ‌చ్చె నెల 11 వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు