Prabhas: దిగొచ్చిన ఆదిపురుష్ టీం… క్షమాపణలు చెబుతూ లేఖ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి తాజాగా వచ్చిన ఆదిపురుష్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. అదే విధంగా వివాదాల్లోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, రాముడు, రావణ్ లుక్స్, హన్ మాన్ చెప్పే డైలాగ్స్ తో రామాయాణాన్ని అభిమానించే వాళ్లు ఈ ఆదిపురుష్ ను వ్యతిరేకిస్తున్నారు. రామాయాణాన్ని వక్రీకరించి సినిమా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, ఆదిపురుష్ చిత్రంలో సీత జన్మస్థలం భారతదేశం అని అర్థం వచ్చేలా ఒక డైలాగ్ పెట్టిన సంగతి విధితమే. దీనిపై ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం స్పందించింది. రామాయాణాన్ని వక్రీకరించేలా సినిమా చేశారని, ఆదిపురుష్ సినిమా మొత్తం అబద్ధాలే ఉన్నాయని నేపాల్ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. అంతే కాదు… నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారతీయ సినిమాలపై ఏకంగా బ్యాన్ విధించారు. ఆదిపురుష్ లో సీత జన్మస్థలం గురించి అభ్యంతరంగా ఉన్న డైలాగ్ ను తీసివేసి, క్షమాపణలు చెప్పకపోతే, భారతీయ సినిమాలను నేపాల్ లో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని కూడా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్ర యూనిట్ స్పందించింది. ఖట్మాండ్ మేయర్ కు నేపాల్ సెన్సార్ బోర్డ్ కు క్షమాపణలు చెబుతూ ఆదిపురుష్ నిర్మాణ సంస్థలు అయిన T సిరీస్ యూవీ క్రియేషన్స్ ఒక లేఖను రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీత జన్మస్థలం గురించి నేపాల్ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసిన డైలాగ్ ను తొలగిస్తామని నిర్మాణ సంస్థలు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు