Mahesh babu : పూజా హెగ్డే విషయంలో మహేష్ కి త్రివిక్రమ్ గొడవలు ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయం సాధించి, మహేష్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించాయి. దాదాపు 13 ఏళ్ళ గ్యాప్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా ఎనౌన్స్ చేసేసరికి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవలనే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా గుంటూరు కారం సినిమా టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయగా, మహేష్ అభిమానులు, మరియు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాపై అంచనాలు కూడా ఒక్కసారిగా డబుల్ అయ్యాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, ప్రస్తుతం గుంటూరు కారం సినిమా వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది.

సినిమా ఎనౌన్స్ చేసినపుడు అంత పాజిటివ్ గానే ఉండగా షూటింగ్ జరుగుతున్న కొద్దీ మాత్రం సినిమాకి సంబందించి ఏదో ఒక వివాదాస్పద న్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాపై కంటే పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో మొదలైన ఈ వివాదాల పర్వం ఈరోజుకి కూడా కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

గుంటూరు కారం స్క్రిప్ట్ త్రివిక్రమ్ పూర్తిగా రెడీ చేయకుండా సినిమా స్టార్ట్ చేయడంతో మూవీ యూనిట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తప్పుకోగా, లేటెస్ట్ గా హీరోయిన్ పూజా హెగ్డేని కూడా తీసేసారు అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. హీరోయిన్ ని సినిమాలో నుంచి తీసివేయం ఏంటని ఆశ్చర్యానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తోంది. ఇవన్నీచూస్తుంటే అసలు సినిమా షూటింగ్ జరిగిందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ చేసి ఆ ఫుటేజ్ అంత డిలీట్ చేశారంటూ నమ్మలేని రూమర్స్ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఆ వార్తలే నిజం అనిపిస్తోంది.

అయితే పూజా హెగ్డే ని తీసేయమని మహేష్ చెప్పిన కూడా త్రివిక్రమ్ ఈ విషయానికి అంగీకరించడం లేదని టాక్. దాంతో మహేష్ త్రివిక్రమ్ పై చాలా సీరియస్ గా ఉన్నాడటా. పూజా హెగ్డే ఉంటే సినిమా చేయను అని మహేష్ తెగేసి చెప్పడంతో గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేని తీసేసినట్టు తెలుస్తోంది. ఇన్ని వివాదాల మధ్య సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అనేది అర్థం కాకుండా ఉంది. మరోపక్క సినిమా దాదాపు ఆగిపోయినట్టే ఫిలిం నగర్ టాక్ నడుస్తుండటంతో ఫ్యాన్స్ లో అయోమయంలో పడిపోయారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు