Biggboss season7: ఈ సారి హౌస్ మేట్స్ అందరూ రతికను డిసైడ్ చేసేశారు?

బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు దూసుకుపోతుంటే, అదరగొడతారనుకున్న సందీప్ మాస్టర్ లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ నుండి ఆట ఇంకా రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా అంబటి అర్జున్ ఆటల్లో అందరి కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో లక్కీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రతిక పరిస్థితే అధోగతిగా మారిందని చెప్పొచ్చు. నాలుగో వారమే ఎలిమినేట్ అయిన రతిక లక్కీ గా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఎంట్రీ ఇచ్చి రెండు వారాలైనా, రతిక తన ఆటలో ఏమాత్రం పెర్ఫార్మన్స్ చూపించడం లేదు. పైగా బయటికి వెళ్లి తన ఆటతీరు తెలుసుకొని వచ్చింది కాబట్టి సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇదే విషయమై లాస్ట్ వీక్ నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చాడు.

కానీ రతిక ఆటలో పెద్దగా మార్పు రాలేదు. ఇక లేటెస్ట్ గా నాగార్జున వీకెండ్ లో హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు ఆట సరిగా ఆడట్లేదో వారి పేర్లు బోర్డు మీద రాయమన్నారు. వాళ్లలో ఎక్కువ మంది రతిక పేరే చెప్పడం జరిగింది. గౌతమ్ అయితే రతిక బయటికి వెళ్లి వచ్చింది కాబట్టి సేఫ్ గేమ్ ఆడుతుంది అనేశాడు. ఇక అందువల్ల రెండో సారి రతిక అందరి చేత అండర్ పెర్ఫార్మర్ అనిపించుకుంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు