Kriti Shetty: బేబమ్మ ఇండస్ట్రీకి రాకముందు ఇలాంటి పని చేసేదా!?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో బేబమ్మగా చెరగని ముద్ర వేసుకుంది. మొదటి సినిమా “ఉప్పెన”తోనే ఉప్పెనలా దూసుకు వచ్చింది. ఫస్ట్ ఎట్ సైట్ అన్నట్టుగా ఆమె ఫాస్ట్ మూవీకి మన కుర్రాళ్లంతా తెగ పడి చచ్చారు. దీంతో ఒక్క మూవీ తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మన బేబమ్మ. అంతేకాదు వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ఇంకేముంది వరుసగా మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ అందుకుంది. ఇక ఈ భామను ఆపలేమని అంతా అనుకుంటున్న సమయంలోనే, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. ఇంకేముంది సందర్భానికి తగినట్టుగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. తెలుగు విషయానికి వస్తే ఆమె శర్వానంద్ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా నటించబోతున్నట్టు టాక్. అయితే ఇప్పుడు ఆమె ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేది అనే విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? అంటే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బేబమ్మ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

ఆ ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదో చెప్పేసింది.. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఇండస్ట్రీకి రాకముందు కృతి శెట్టి ఎలాంటి జాబ్ చేసేదని, ఆ జాబ్ కు శాలరీ ఎంత అని ప్రశ్నించింది. అందుకు సమాధానంగా కృతి శృతి స్పందిస్తూ తాను కాస్త పెద్దయ్యాక తన అమ్మకు కావాల్సిన గ్రసరి ఐటమ్స్ అన్నీ కూడా షాప్ కు వెళ్లి తీసుకువచ్చేదట. అదే తన ఫస్ట్ జాబ్ అంటూ వెల్లడించింది కృతి శెట్టి. అలా మా అమ్మకు హెల్ప్ చేయగా ఆమె నాకు 100 నుంచి 150 రూపాయలు ఇచ్చేది. అదే నా ఫస్ట్ శాలరీ అంటూ మరోసారి అందరి మనసులు కొల్లగొట్టే క్యూట్ రిప్లై ఇచ్చింది.

ఇక కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈ బ్యూటీ కస్టడీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అంతకుముందు బంగార్రాజు సినిమాలో ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కస్టడీలో కూడా రిపీట్ అయింది. కానీ ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ జరగలేదు. ఇక ఆ తర్వాత కృతి శెట్టి అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. ఇక ఇప్పుడు శర్వానంద్ మూవీ లో అవకాశం వచ్చిందంటూ టాక్ నడుస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు