Tollywood: దేశంలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న 20మంది హీరోలు వీళ్లే..!

ఒక‌ప్పుడు సినిమాల బ‌డ్జెట్ త‌క్కువ‌గా ఉండేది కాబ‌ట్టి రెమ్యున‌రేష‌న్స్ కూడా త‌క్కువ‌గానే ఉండేవి. కానీ ఇప్పుడు సినిమాల బ‌డ్జెట్ వేల కోట్ల‌లో ఉంటుంది. కాబ‌ట్టి హీరోల రెమ్యున‌రేష‌న్లు ఓ రేంజ్ లో పెరిగిపోయింది. టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా క్రేజ్ ఉంటే హీరోలు వంద‌ల కోట్ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నారు. ఇక తాజా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ ప్ర‌కారం బాలీవుడ్, కోలీవుడ్, సాండ‌ల్ వుడ్, టాలీవుడ్ ల‌లో మొత్తం 20 మంది హీరోలు అత్య‌ధిక రెమ్య‌న‌రేష‌న్ పుచ్చుకుంటున్నారు. ఆ హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.150 నుండి రూ.250కోట్లు పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇండియాలోనే ఇది అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ కావ‌డం విశేషం. అంతే కాకుండా ఆ త‌ర‌వాత స్థానంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఉండ‌టం విశేషం. రజినీకాంత్ ఒక్కో సినిమాకు రూ.120 నుండి రూ.210 కోట్లు పుచ్చుకుటున్న‌ట్టు స‌మాచారం.

ఆ త‌ర‌వాత లిస్ట్ లో వ‌రుస‌గా…ద‌ళ‌ప‌తి విజ‌య్ రూ.100 నుండి రూ.200 కోట్లు, ప్ర‌భాస్ రూ.100 నుండి రూ.200 కోట్లు, అమీర్ ఖాన్ రూ.100 నుండి రూ.175 కోట్లు, స‌ల్మాన్ ఖాన్ రూ.100 నుండి రూ.150 కోట్లు, క‌మ‌ల్ హాస‌న్ రూ.100 నుండి రూ.150 కోట్లు, అల్లు అర్జున్ రూ.100 నుండి రూ.120 కోట్లు, అక్ష‌య్ కుమార్ రూ.60 నుండి రూ.130 కోట్లు, త‌మిళ స్టార్ అజిత్ రూ.105 కోట్లు, ఎన్టీఆర్ రూ.100 కోట్లు, రామ్ చ‌ర‌ణ్ రూ.100 కోట్లు, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ రూ.85 నుండి రూ.100 కోట్లు, మ‌హేశ్ బాబు రూ.80 నుండి రూ.100 కోట్లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.60 నుండి రూ.100 కోట్లు, య‌శ్ రూ.60 నుండి రూ.100 కోట్లు, ర‌న్ బీర్ క‌పూర్ రూ.50 నుండి రూ.75 కోట్లు, అజ‌య్ దేవ్ గ‌న్ రూ.45 నుండి రూ.75 కోట్లు, చిరంజీవి రూ. 40 నుండి రూ.70 కోట్లు, త‌మిళ స్టార్ సూర్య రూ. 35 నుండి 70కోట్ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వీరిలో కొంత‌మంది హీరోలు త‌మ సినిమాల్లో వాటాను కూడా తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా క‌నిపిస్తోంది. స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరోలు సినిమాకు రెమ్యున‌రేష‌న్ కాకుండా ముందుగానే సినిమా విజ‌యం సాధిస్తే వ‌చ్చే లాభాల్లో వాటా కావాల‌ని ఒప్పందం చేసుకుంటున్నారు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు