Biggboss twist: ఇద్దరిలో గెలిచిన వారికీ మళ్ళీ పోటీ?

బిగ్ బాస్ సీజన్ 7 లో పదకొండో వారంలో జరిగిన “హూ డిసర్వ్ టాప్ 10” టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ తమ తమ అభిప్రాయాల ప్రకారం టాప్ 10 కంటెస్టెంట్స్ ని ఏ ప్లేస్ లో ఉన్నారో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో టాప్ 5 లో వరుసగా శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా లు నిలవగా, తర్వాతి స్థానాల్లో వరుసగా అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక లు నిలిచారు.

అయితే బిగ్ బాస్ టాప్ 10 లో చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వాళ్ళకి టాప్ 5 లో నిలిచేందుకు ఆ ఐదుగురి మధ్య టాస్క్ నిర్వహించగా, అర్జున్ ఆ టాస్క్ లో గెలిచాడు. అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సీజన్ ఉల్టా పల్టా కాబట్టి, టాప్ 5 లో ఉన్న ఐదుగురి లో ఒకరితో పోటీపడాలని అర్జున్ కి పోటీ పెట్టడం జరిగింది. ఇక అర్జున్ యావర్ ని తనతో పోటీపడాల్సిందిగా ఎన్నుకున్నాడు.

ఇక ఆ టాస్క్ తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కనిపించగా, అర్జున్, యావర్ కొన్ని ఫుట్ బాల్స్ ని పట్టుకుని ఒక బెండ్ అయ్యే టేబుల్ డెస్క్ పై నిల్చుని దానిపైన ఉన్న బాల్స్ ని ఉంచాలని అంటారు. అయితే ఇక్కడితో ఆగకుండా బిగ్ బాస్ ఆ టాస్క్ లో గెలిచిన వాళ్ళని తిరిగి టాప్ 5 లో ఉన్న వేరే కంటెస్టెంట్లతో కూడా పోటీ పడాలని చెప్పడం జరిగింది. చూస్తుంటే ఈ తంతు ఈ వారం పూర్తయ్యే వరకు జరిగేలా కనిపిస్తుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ మాత్రం రతిక లేదా అశ్విని లో ఒకరయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు